పవన్ కళ్యాణ్ కోసం ఆ ముగ్గురూ

ఆయనేమో సినిమాలు వదిలేసా.. కోట్ల ఆదాయం వదిలేసా.. వచ్చే సమస్యేలేదు అంటారు. కానీ సినిమా జనాలు మాత్రం ఎలాగైనా పవర్ స్టార్ ను మళ్లీ సినిమాల్లోకి లాగాల్సిందే అనుకుంటున్నారు. అలావస్తే, రాజకీయాలు పార్ట్ టైమ్,…

ఆయనేమో సినిమాలు వదిలేసా.. కోట్ల ఆదాయం వదిలేసా.. వచ్చే సమస్యేలేదు అంటారు. కానీ సినిమా జనాలు మాత్రం ఎలాగైనా పవర్ స్టార్ ను మళ్లీ సినిమాల్లోకి లాగాల్సిందే అనుకుంటున్నారు. అలావస్తే, రాజకీయాలు పార్ట్ టైమ్, లేదా టైమ్ పాస్ అన్న విమర్శలు వస్తాయేమో అన్నది జనసైనికుల అనుమానం. ఇలాంటి నేపథ్యంలో మూడు ప్రాజెక్టులు పవన్ కళ్యాణ్ ముందుకు తెస్తున్నారు ముగ్గురు నిర్మాతలు.

ఒకటి.. పింక్ రీమేక్. పింక్ సినిమా ఆధారంగా తమిళంలో అజిత్ చేసిన సినిమా హక్కులు నిర్మాత దిల్ రాజు కొన్నారు. ఆ సినిమాను పవన్ తో రీమేక్ చేయాలన్న ఆలోచన ఆయనది. డైరక్టర్ ఎవరు అన్నది పవన్ ఛాయిస్ కే వదిలేస్తారు. ఈ విషయం కోసం పవన్ ను కలవాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు.

రెండు.. దర్శకుడు క్రిష్-నిర్మాత ఎఎమ్ రత్నం కాంబినేషన్. ఈ ప్రాజెక్టు మీద క్రిష్ గట్టి నమ్మకంతో వున్నారు. కథ రెడీ చేసేసారు. నేడు లేదా రేపు పవర్ స్టార్ కు కథ చెప్పబోతున్నారు. పక్కా క్రిష్ స్టయిల్ కథ అది అని తెలుస్తోంది.

మూడు.. మైత్రీమూవీస్ కాంబినేషన్ లో డైరక్టర్ హరీష్ శంకర్. ఈ కాంబినేషన్ సెట్ చేయాలనే ప్రయత్నాలు కూడా గట్టిగా జరుగుతున్నాయి.

నిర్మాతగా మూడు..
ఇదిలావుంటే మరో ముచ్చట కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ 2021లో మూడు సినిమాలు తన బ్యానర్ మీద నిర్మించే ఆలోచనలో వున్నారన్నది ఆ టాక్. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో మూడు సినిమాలు నిర్మించాలని పవన్ భావిస్తున్నారని గట్టిగా వినిపిస్తోంది.

వీటి సంగతి ఎలావున్నా, పవన్ సినిమా చేసే విషయం మాత్రం త్వరలోనే క్లారిటీ వచ్చేస్తుందని వినిపిస్తోంది.

అదొక్కటే.. జగన్ తప్పుడు నిర్ణయం