Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అమెజాన్ వెబ్ సిరీస్ లో సమంత

అమెజాన్ వెబ్ సిరీస్ లో సమంత

హీరోయిన్ సమంత ఏం చేసినా సమథింగ్ డిఫరెంట్ గా వుంటుంది. అలావుండేలా చూసుకోవడం ఆమె స్పెషాలిటీ. ప్రతి సినిమా హిట్ కొడుతూ లక్కీలేడీ అనిపించుకుంటోంది ఇప్పటికే. లేటెస్ట్ గా ఓ బేబీ సినిమా తరువాత శర్వానంద్ తో 96 రీమేక్ స్టార్ట్ చేసిన సమంత, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు టేకప్ చెసినట్లు తెలుస్తోంది.

అమెజాన్ సంస్థ నిర్మించే ఓ వెబ్ సిరీస్ ను సమంత అంగీకరించింది. ఈ వెబ్ సిరీస్ లో సమంతదే ప్రధానపాత్ర. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో తయారయ్యే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం చెన్నయ్ లో జరుగుతోంది. ఇందుకోసం ఏకంగా 40 కాల్ షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ఏదో సమ్ థింగ్ లేకుంటే సమంత ఓకె చెప్పదు. అది మాత్రం పక్కా.

ఇదిలావుంటే సమంత వెబ్ సిరీస్ మీదకు వెళ్లడంతో టెంపరరీగా 96 సినిమాకు కాస్త బ్రేక్ పడింది. శర్వానంద్ గాయపడడంతో, ఆ సినిమా ఇప్పుడే స్టార్ట్ కాదనే ఆలోచనతో సమంత వెబ్ సిరీస్ కు ఓకె చెప్పింది. కానీ శర్వానంద్ వేగంగానే కోలుకుని, సమంత డేట్ లు అందుబాటులో లేకపోవడంతో, తను ఓకె చెప్పిన మరో సినిమా శ్రీకారం షూట్ ను స్టార్ట్ చేసాడు. వీలైతే ఈ సినిమాను సంక్రాంతికి రంగంలోకి దింపాలన్నది శ్రీకారం నిర్మాతల ఆలోచన.

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?