Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెంకీ మామకు యాభై కోట్లు

వెంకీ మామకు యాభై కోట్లు

సాధారణంగా హీరో వెంకటేష్ సినిమాకు ఖర్చు కాస్త రీజనబుల్ గానే వుంటుంది. అలాగే నాగచైతన్య సినిమాలకు కూడా. కానీ ఈ ఇద్దరు కలిసి చేస్తున్న వెంకీ మామ సినిమాకు మాత్రం వ్యయం యాభై కోట్లు దాటేసింది. కేవలం ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లతో కూడిన మల్టీ స్టారర్ అన్నదే కారణం కాదు. సినిమాలో యాక్షన్ సీన్లు కాస్త భారీగా తీయడం వల్ల ఖర్చు పెరిగినట్లు తెలుస్తోంది.

60 వర్కింగ్ డేస్ టాకీ కోసం అవసరం పడితే, యాక్షన్ సీన్లకు కూడా మరో అరవై రోజులు కావాల్సి వచ్చిందట. పైగా యాక్షన్ సీన్లు కూడా భారీగా తీసారట. అలాగే కాశ్మీర్ లో వెంకీ ఆర్మీ సీన్లకు కాస్త ఎక్కువే ఖర్చయినట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో వెంకీ సినిమాకు కానీ, చైతూ సినిమాకు కానీ యాభై కోట్లకు పైగా ఖర్చుచేయడం అంటే ఇదే. వెంకీ మామ సినిమా దాదాపు పూర్తయింది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని యాక్షన్ సీన్లు తీస్తున్నారు. ఇవికాక ఒకటి రెండుపాటలు చిత్రీకరిస్తే వర్క్ పూర్తయినట్లే.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 4న విడుదలవుతుంది.

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?