Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాయితేజ్ కూడా ఆ టీమ్ లో..?

సాయితేజ్ కూడా ఆ టీమ్ లో..?

చిత్రలహరి సినిమాతో లైన్ లోకి వచ్చాడు సాయిధరమ్ తేజ్. లేటెస్ట్ సినిమాను ఎంటర్ టైన్ మెంట్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో చేస్తున్నాడు. తొలిసారి మారుతి కేవలం ఎంటర్ టైన్ మెంట్ కు హ్యూమన్ ఎమోషన్స్ జోడించి చేస్తున్న సినిమా ప్రతిరోజూ పండగే. ఒక విధంగా ఆయన తన కెరీర్ కు తనే టర్న్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అంతేకాదు, ఈ సినిమాలో రెండు బీభత్సమైన ఫైట్లు కూడా వుంటాయట. ఇందులో ఓ ఫైట్ లో సాయిధరమ్ తేజ్ వంటిపై షర్ట్ లేకుండా వుంటాడట. సినిమాలోని ఓ సన్నివేశంలో హీరో హోమం చేస్తుండగా ఫైట్ సీన్ వస్తుందట. అందువల్ల వంటిపై షర్ట్ వుండదు. ఎలాగూ షర్ట్ లేకుండా ఫైట్ కాబట్టి, కాస్త ఫిట్ బాడీ, వీలయితే సిక్స్ ప్యాక్ వుంటే బాగుంటుందని ఆలోచన చేసారట హీరో, డైరక్టర్ కలిసి.

దాంతో సాయిధరమ్ తేజ్ హుటాహుటిన ముంబాయిలో వాలిపోయినట్లు తెలుస్తోంది. అక్కడ ఫిట్ నెస్ ట్రయినర్ సాయంతో మాంచి ఫిజిక్ లుక్ సాధించే పనిలో బిజీ అయినట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ పండగే సినిమా తరువాత షెడ్యూలు ఈనెల 20 తరువాత వుంటుంది.

అంతవరకు ముంబాయిలోనే వుండి ఫిట్ నెస్ వర్కవుట్ లు చేస్తాడట సాయిధరమ్ తేజ్. అందువల్ల ఈ సినిమాలో సాయితేజ్ సిక్స్ ప్యాక్ బాడీని అభిమానుల చూసే అవకాశం వుంది.

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?