Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అమ్మడు కేరాఫ్ బాలీవుడ్

అమ్మడు కేరాఫ్ బాలీవుడ్

కనెక్షన్ కరెక్ట్ గా సెట్ కావాలి కానీ ఏ వుడ్ అయితే ఏంటీ? ఇలాగే థింక్ చేస్తోంది ఓ టాలీవుడ్ హీరోయిన్. చకచకా సినిమాలు చేసి, గ్లామర్ డాల్ అనిపించుకుని, బిజినెస్ వుమెన్ అని కూడా ట్యాగ్ లైన్ సెట్ చేసుకుని టాలీవుడ్ లో చాలా గ్యాసిప్ లకు చాన్స్ ఇచ్చిన ఈ హీరోయిన్ చటుక్కున బాలీవుడ్ కు షిప్ట్ అయిపోయింది.

అలా అని ఇక్కడ సినిమాలు చేయకపోవడం లేదు. ఇక్కడా చేస్తోంది. కానీ ఇక ఇక్కడ గ్యాసిప్ లు మాయం అయ్యాయి. ఇప్పుడు అంతా బాలీవుడ్ లోనే. అది కూడా ఓ సీనియర్ హీరోతో అక్కడ చెట్టాపట్టాలు వేసుకుందని, ఆయన డైరక్షన్ లోనే ముందుకు సాగుతోందని వార్తలు వినిప్తిస్తున్నాయి. 

తెలుగు, తమిళంలో సినిమాలు చేతిలో వున్నా కూడా ఇక బాలీవుడ్ లోనే సెటిలయ్యే ఆలోచన వుందట ఈ నార్త్ హీరోయిన్ కు. 

బాలీవుడ్ సీనియర్ హీరో అభిమానం బాగా సంపాదించిందని, ఇక ఇప్పుడు ఎవ్వరితోనూ గ్యాసిప్ లు లేవని, కేవలం ఆ సీనియర్ హీరోతో తప్ప అని టాక్ బలంగా వినిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?