అమ్మాయిలతో ‘సిట్టింగ్స్

సినిమా ప్రపంచం అంటేనే గ్లామర్. రామ్ గోపాల్ వర్మ ఇద్దరు హీరోయిన్లను చెరో పక్క కూర్చో పెట్టుకుని దేశం అంతా చక్కర్లు కొట్టారు. పార్టీలు అంటూ హల్ చల్ చేసారు.  Advertisement కానీ అందరూ…

సినిమా ప్రపంచం అంటేనే గ్లామర్. రామ్ గోపాల్ వర్మ ఇద్దరు హీరోయిన్లను చెరో పక్క కూర్చో పెట్టుకుని దేశం అంతా చక్కర్లు కొట్టారు. పార్టీలు అంటూ హల్ చల్ చేసారు. 

కానీ అందరూ అలా చేయలేరు. పైగా సంబంధాలు మరి కాస్త ముందుకు వెళ్తే మరీ ఇబ్బంది. ఈ మధ్యన ఓ పెద్ద సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ చిత్రంగా జ‌రిగాయని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

ఆయన ఓ మంచి పేరున్న డైరక్టర్. ఆయన సీనియర్ మ్యూజిక్ డైరక్టర్. ఇద్దరూ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేసారట. ఈ సిట్టింగ్స్ కు ఆ మ్యూజిక్ డైరక్టర్ తనకు బాగా సన్నిహితమైన సింగర్ ను తీసుకుని మరీ వచ్చారట. 

తానేం తక్కువ తిన్నానా అంటూ సదరు డైరక్టర్ కూడా తనకు బాగా సన్నిహితమైన ఇద్దరు అమ్మాయిలను తీసుకుని వచ్చారట.

మొత్తం మీద ఈ ముగ్గురు..ఆ ఇద్దరు కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ రంజుగా సాగించారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.