మెగాస్టార్ స్వంత బ్యానర్ కొణిదెల…అల్లు అరవింద్ అండ్ ఫ్యామిలీ ఓన్ బ్యానర్ గీతా. అందరూ బంధువులే. అయితే సెకెండ్ జనరేషన్ మొదలయ్యాక, అందరూ హీరోలుగా మారిన తరువాత పోటీలు పెరిగాయని, బంధాలు వున్నాయి కానీ పోటీలు గట్టిగా వున్నాయని రకరకాల టాక్ లు వున్నాయి. వాటి సంగతి ఎలా వున్నా, ఎప్పటికప్పుడు కలిసి మెలిసే వుంటున్నారు.
ఇదిలా వుంటే మెగాస్టార్ తోడల్లుడు కుమార్తె విద్య ను కొణిదెల కంపెనీకి సిఇఓ గా పెట్టుకున్నారు. సైరా సినిమా వ్యవహారాలు ఆమె నే చూసారు
కానీ సైరా సినిమా తరువాత కొణిదెల సంస్థ సినిమాల నిర్మాణానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పేసింది. బ్యానర్ వేయడం తప్ప నిర్మాణ వ్యవహారాలకు దూరంగా వుంటోంది. బహుశా అందుకే ఇక్కడ అక్కడ ఏం పని లేదనేమో, విద్య ఇప్పుడు గీతాలో జాయిన్ అయ్యారు. అంటే పెదనాన్న కంపెనీ నుంచి మామయ్య కంపెనీలో చేరారన్నమాట.
ప్రస్తుతం నిఖిల్-అనుపమ నటించిన 18 పేజెస్ వ్వవహారాలు ఆమె చూసుకుంటున్నారు. భవిష్యత్ లో గీతా సంస్థలో విద్య కీలకపాత్ర పోషించబోతున్నారని టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ఇప్పటి వరకు బన్నీ వాస్ గీతాలో కీలకంగా వున్నారు. ఇప్పుడు ఆయన ఎక్కువగా ముంబాయిలో వుంటున్నారు. అక్కడ సినిమాల నిర్మాణలు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో విద్య గీతాలోకి ప్రవేశించడం విశేషం.