సినిమా తీయడం వరకు ఓకె. కానీ విడుదలే కష్టం. విడుదల చేసినా, వసూళ్లు రావడం కష్టం. వచ్చిన వసూళ్లను రాబట్టుకోవడం ఇంకా కష్టం.
కార్తికేయ విడుదలకు చాలా ఇబ్బందులు..ఆఖరికి అయినకాటికి ఇచ్చేయాల్సి వచ్చింది. నిర్మాతకు నష్టాలు..సినిమా మాత్రం సూపర్ హిట్.
లేడీస్ అండ్ జెంటిల్ మన్..విడుదలకు చాలా కాలం పట్టింది. ఆఖరికి సురేష్, మల్టీ డైమన్షన్ కు ఇచ్చేయాల్సి వచ్చింది.
గడ్డం గ్యాంగ్..అదే పరిస్థితి. ఆఖరికి సురేష్ కు ఇచ్చేసారు.
కెఎస్ రామారావు తీసిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. విడుదల ముందు రోజు వరకు ఇబ్బందులే. ఆఖరికి నేరుగానే విడుదల చేసుకోవాల్సి వచ్చింది. సినిమా బాగుంది..మంచి సినిమా తీసారు..జనాల కంట తడి పెట్టించారు అని ప్రశంసిస్తే..నిర్మాత కెఎస్ వలభ సమాధానం…''..విడుదలకు మేం కంట తడి పెట్టామండి..అవన్నీ కాదు..డబ్బులు వస్తాయా..రావా అది చెప్పండి'..
ఇలా తయారైంది టాలీవుడ్ లో నిర్మాతల, సినిమాల పరిస్థితి. సినిమా తీయడం సులువే..విడుదల చేయడం..వసూళ్లు వస్తే రాబట్టుకోవడమే..కష్టం..ఎప్పటికి ఈ తీరు మారుతుందో?