మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. మంచి సినిమా. అభిరుచి గల నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నుంచి వచ్చింది. కానీ ఈ సినిమా నిర్మాత మాత్రం విడుదలకు ముందు రోజు నానా టెన్షన్లు పడినట్లు వినికిడి. అసలు సినిమా విడుదలవుతందా అన్నంత టెన్షన్ పడ్డారట.
ఆఖరికి తన పలుకుబడి వాడి, ఓ న్యూస్ చానెల్ ద్వారా, మరో ఎంటర్ టైన్ మెంట్ చానెల్ ను పట్టుకుని, శాటిలైట్ హక్కులు అప్పటికి అప్పుడు అప్పి, కోటి డెభై అయిదు లక్షలకు చెక్ తీసుకుంటే, సమస్యలు సద్దు మణిగి సినిమా విుడదలకు మార్గం సుగమం అయిందట. టాలీవుడ్ కు చెందిన వీరశంకర్ ఈ వైనం అంతా తన ఫేస్ బుక్ లో సినిమా పేరు చెప్పకుండానే బయట పెట్టి, ఈ పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతా శాటిలైట్ రేట్లు పడిపోవడం వల్లనే అని, చానెళ్ల గుత్తాధిపత్యం పై చర్చ జరగాలని అంటున్నారాయన. ఏదైనా ఏ నిర్మాతకు మళ్లీ మళ్లీ ఇలాంటి ఇబ్బందికర రోజులు మళ్లీ మళ్లీ రాకూడదు.