అనసూయకు కలిసొచ్చిన విన్నర్

సాయిధరమ్ తేజ హీరోగా నటించిన విన్నర్ సినిమా డిజాస్టర్ అయింది. వరుసగా రెండు డిజాస్టర్లతో తేజూ కెరీర్ డైలమాలో పడింది. అటు ఆ సినిమాను డైరక్ట్ చేసిన గోపీచంద్ మలినేని కూడా ప్రస్తుతానికి అజ్ఞాతం…

సాయిధరమ్ తేజ హీరోగా నటించిన విన్నర్ సినిమా డిజాస్టర్ అయింది. వరుసగా రెండు డిజాస్టర్లతో తేజూ కెరీర్ డైలమాలో పడింది. అటు ఆ సినిమాను డైరక్ట్ చేసిన గోపీచంద్ మలినేని కూడా ప్రస్తుతానికి అజ్ఞాతం మెయింటైన్ చేస్తున్నాడు. హీరోయిన్ రకుల్ అయితే ఆ సినిమా గురించి ఎక్కడా చర్చించడం మానేసింది. అయితే ఒకేఒక్క భామకు మాత్రం విన్నర్ నిజంగా కలిసొచ్చింది. ఆమె పేరు అనసూయ.

బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్ అయిన ఈ హాట్ ఆంటీ.. విన్నర్ లో ఐటెంసాంగ్ చేసింది. ఈ ఐటెంసాంగ్ ఈమెకు 2 రకాలుగా కలిసొచ్చింది. ఒకటి.. అనసూయ టీవీల్లో ఏ షో చేసినా, తను ఏ కార్యక్రమానికి అతిథిగా వెళ్లినా బ్యాక్ గ్రౌండ్ లో ఈ సాంగ్ కామన్ అయిపోయింది. ఒకప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో సోగ్గాడే చిన్నినాయనా సాంగ్ వస్తే, ఇప్పుడు విన్నర్ సాంగ్ తో అనసూయ పాపులర్ అయిపోయింది.

ఇక అనసూయకు కలిసొచ్చిన రెండో ఎలిమెంట్.. రామ్ చరణ్ సినిమా. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో అనసూయను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆమెను స్పెషల్ సాంగ్ కోసం అప్రోచ్ అయ్యారా లేక ఓ ప్రత్యేక పాత్ర కోసం కలిశారా అనే విషయాన్ని పక్కనపెడితే… ఆ పాత్రను అనసూయ చేస్తే బాగుంటుందని స్వయంగా చరణ్ ఫీల్ అయ్యాడట. విన్నర్ లో ఆమె పర్ఫార్మెన్స్ చూసి మరీ ఈ ఛాన్స్ ఇచ్చాడట. ఇదే కనుక నిజమైతే.. అట్టర్ ఫ్లాప్ అయిన విన్నర్ సినిమాను అనసూయ జీవితాంతం గుర్తుంచుకోవాల్సిందే.