అనాథ డేట్ ఆగస్టు 31

ఆగస్ట్ 31. డైరక్టర్ మారుతి ఏరి కోరి తన సినిమా శైలజారెడ్డి అల్లుడు కోసం ఫిక్స్ చేసుకున్న ముహుర్తం. ఆ డేట్ మీద ఎంత మక్కువ అంటే, మరో సినిమా సవ్యసాచికి ఆ డేట్…

ఆగస్ట్ 31. డైరక్టర్ మారుతి ఏరి కోరి తన సినిమా శైలజారెడ్డి అల్లుడు కోసం ఫిక్స్ చేసుకున్న ముహుర్తం. ఆ డేట్ మీద ఎంత మక్కువ అంటే, మరో సినిమా సవ్యసాచికి ఆ డేట్ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. చైతూ-చందు మొండేటి సవ్యసాచికి, చైతూ-మారుతి శైలజా రెడ్డి అల్లుడుకు మధ్య ఆ డేట్ కోసం పోటీ ఓ లెక్కలో నడిచింది. విపరీతమైన మల్లగుల్లాలు పడ్డారు. మీటింగ్ లు, మా సినిమా రెడీ అయిపోయింది అని ఒకరు అంటే, మా సినిమా రెడీ అయిపోతోందని మరొకరు. ఆఖరికి పంచాయతీల మీద పంచాయతీలు.

చివరకు సవ్యసాచి వెనక్కు వెళ్లింది. శైలజారెడ్డి అల్లుడు ఫుల్ కంఫర్ట్ జోన్ లో రెడీ కావడానికి రెడీ అయింది. కానీ తానొకటి తలిస్తే..అన్నట్లు అయిపోయింది ఇప్పుడు. గాలీవానా వస్తే కథేలేదు అన్నది వెనకటికి సామెత. ఆ రోజుల్లో ఆరుబయట హరికథలు, బుర్రకథలు చెప్పేవారు. అందువల్ల గాలీ వానా వస్తే కార్యక్రమం జరిగేది కాదు. సో, ఆ విధంగా ఆ సామెత పుట్టింది. కానీ ఇప్పుడు మళ్లీ అదే నిజమైంది.

కేరళలో గాలీవానా వచ్చి, శైలజారెడ్డి అల్లుడి ఆశల మీద నీళ్లు జల్లేసింది. మొత్తానికి ఆగస్టు 31 డేట్ ఎవరికీ కాకుండా మిగిలిపోయింది.