నర్తనశాలలో కళామందిర్ కళ్యాణ్

సినిమాల్లో క్యారెక్టర్లకు కాస్త పాపులర్ పేర్లు తగిలించడం కొత్తకాదు. సరదా కోసం ఫన్ కోసం అలా చేస్తారు. కానీ నర్తనశాలలో ఓ క్యారెక్టర్ ను ఏకంగా లైవ్ క్యారెక్టర్ గానే వాడేసారట. సినిమాలో హీరో…

సినిమాల్లో క్యారెక్టర్లకు కాస్త పాపులర్ పేర్లు తగిలించడం కొత్తకాదు. సరదా కోసం ఫన్ కోసం అలా చేస్తారు. కానీ నర్తనశాలలో ఓ క్యారెక్టర్ ను ఏకంగా లైవ్ క్యారెక్టర్ గానే వాడేసారట. సినిమాలో హీరో నాగశౌర్య తండ్రిగా శివాజీ రాజా కనిపిస్తాడు. అతగాడి క్యారెక్టర్ పేరు కళామందిర్ కళ్యాణ్.

కళామందిర్ కళ్యాణ్ అన్న పేరు హైదరాబాద్ లోనే కాదు, చాలాచోట్ల చిరపరిచితం. కళామందిర్ దుకాణాల నిర్వహణ చూసే కీలక భాగస్వామి పేరు అది. సినిమాలో కూడా అదే విధంగా చూపించారట. అంటే శివాజీ రాజా కళామందిర్ దుకాణాల యజమాని అయిన కళామందిర్ కళ్యాణ్ గా కనిపిస్తాడన్నమాట.

సినిమాలో ఫన్ పండించే క్యారెక్టర్లలో ఇది ఒకటి. కళామందిర్ కళ్యాణ్ సినిమా జనాలు అందరికీ బాగా సన్నిహితుడు. సినిమాల షూటింగ్ లకు, ప్రచారానికి ఆయన వీలయినంత సహాయం అందిస్తుంటారు. అలాగే సినిమా ఫంక్షన్ లకు స్పాన్సర్ గా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఏకంగా సినిమాల్లోకే వచ్చేసిందన్నమాట.

నిజమైన కళామందిర్ కళ్యాణ్ కూడా దీన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. తన అన్ని షోరూమ్ ల్లో నర్తనశాల టీజర్ లు, సాంగ్ లు, బ్రాడ్ కాస్ట్ చేసి, సినిమా ప్రచారానికి తనవంతు సాయం చేస్తున్నారు.