బాలీవుడ్ ‘కత్తి’ ఎవరు?

కత్తి.. సౌత్ లో సూపర్ హిట్ అయిన సబ్జెక్ట్. కోలీవుడ్ లో ఈ సినిమాతో విజయ్ సూపర్ హిట్ కొట్టాడు. ఇదే సినిమాను తెలుగులో ఖైదీ నంబర్-150గా రీమేక్ చేసిన చిరంజీవి రీఎంట్రీలో సూపర్…

కత్తి.. సౌత్ లో సూపర్ హిట్ అయిన సబ్జెక్ట్. కోలీవుడ్ లో ఈ సినిమాతో విజయ్ సూపర్ హిట్ కొట్టాడు. ఇదే సినిమాను తెలుగులో ఖైదీ నంబర్-150గా రీమేక్ చేసిన చిరంజీవి రీఎంట్రీలో సూపర్ హిట్ కొట్టారు. అలా సౌత్ మొత్తం సక్సెస్ అయిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది.

కత్తి సినిమా రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ టాప్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దక్కించుకున్నారు. పద్మావత్ లాంటి భారీ సినిమా తీసిన భన్సాలీ, తన నెక్ట్స్ ప్రాజెక్టుగా, రైతు సమస్యలపై తెరకెక్కిన కత్తిని సెలక్ట్ చేసుకోవడం విశేషం. తనదైన స్టయిల్ లో ఈ కథకు తుదిమెరుగులు దిద్ది సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు భన్సాలీ.

అయితే ఈ సినిమాను భన్సాలీ డైరక్ట్ చేయడు. తను రీమేక్ రైట్స్ తీసుకున్న ప్రతిసారి ఆ ప్రాజెక్టును ఏదో ఒక దర్శకుడికి అప్పగిస్తాడు భన్సాలీ. విక్రమార్కుడు రీమేక్ రైట్స్ తీసుకొని ప్రభుదేవాకు అప్పగించాడు. ఠాగూర్/రమణ రీమేక్ రైట్స్ తీసుకొని క్రిష్ కు అప్పగించాడు. ఇప్పుడు కత్తి రీమేక్ ను కూడా ఓ డైరక్టర్ కు అప్పగించబోతున్నాడు.

దర్శకుడి సంగతి పక్కనపెడితే, ఈ రీమేక్ లో హీరో ఎవరనే డిస్కషన్ బాలీవుడ్ లో జోరుగా సాగుతోంది. చాలామంది సల్మాన్, షారూక్ లాంటి పేర్లను ప్రస్తావించినప్పటికీ.. భన్సాలీ రీమేక్ రైట్స్ తీసుకున్న ప్రతిసారి అందులో అక్షయ్ కుమార్ మాత్రమే కనిపిస్తున్నాడు. సో.. కత్తి రీమేక్ లో కూడా అక్షయ్ కుమారే హీరోగా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.