యాంకర్లు అంటేనే అందంగా వుండాలి. అందంగా కనిపించాలి. అప్పుడు అవకాశాలు వస్తాయి. కేవలం మాటలతోనే యాంకరింగ్ అంటే కాదు. సుమ లాంటి ఏ ఒకరిద్దరికో తప్ప మిగిలిన అందరికీ యాంకరింగ్ అంటే కాస్త అందాలు ఆరబోయాల్సిందే అన్నట్లు వుంటుంది. అయితే అలా అని యాంకర్లు ఎప్పుడూ గీత దాటరు. వీలయినంత కొత్తగా, వెరైటీగా, ఫంక్షన్ కు తగినట్లుగా డ్రెస్ చేసుకుని రావడమే తప్ప మితిమీరినట్లు ఎక్కడా కనిపించరు.
అయితే మరి అవకాశాల కోసమో, లేదా గ్లామర్ అనో ఇటీవల ఓ యాంకర్ మాత్రం కాస్త గీత దాటుతున్నట్లు కనిపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ యాంకర్ ఇలా కాస్త గీత దాటడం వల్ల యూ ట్యూబ్ షార్ట్స్ లో వ్యూస్ బాగా వస్తున్నాయి.దాంతో అందరూ ఆ బిట్ లను లోడ్ చేస్తున్నారు. ఇది చూసి ఆమెను యాంకర్ గా పిలవడం పెరిగింది. అది చూసి ఆమె కూడా గ్లామర్ డోస్ పెంచుతున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల ఓ ఫంక్షన్ కు హీరోయిన్ పద్దతిగా వస్తే, యాంకర్ మాత్రం ఎద అందాలు సగానికి పైగా ఆరబోస్తూ వచ్చారు. దాంతో ఎవరు పడితే వాళ్లు తమ ఫోన్ లను అటే తిప్పారు. క్లిక్ ల మీద క్లిక్ లు యాంకర్ మీదే పడ్డాయి. ఏం చేస్తాం. గ్లామర్ వుండగానే నాలుగు అవకాశాలు అంది పుచ్చుకోవాలి. లేదంటే తరువాత ఎవరు పిలిచి అవకాశం ఇస్తారు. అందుకే ఆ దారిలోనే వెళ్తున్నట్లుంది ఆ యాంకర్.
అన్నట్లు ఈ యాంకర్ ఇలా గ్లామర్ ఒలకబోస్తుంటే, అది చూసి ఓ యువ నిర్మాత మనసు పారేసుకున్నట్లు గ్యాసిప్ లు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ సంగతి ఆ యాంకర్ కు తెలుసో లేదో?