‘గోవిందుడు అందరివాడేలే’ స్టిల్స్, టీజర్ చూసే ఉంటారుగా? వాటిలో చరణ్, ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్ మాత్రమే హైలైట్ అవుతున్నారు. ప్రకాష్‌రాజ్ తాతగా, చరణ్ మనవడిగా, శ్రీకాంత్ ఏమో చరణ్ బాబాయ్‌గా నటించారు. మరి చరణ్ తండ్రి ఏమైనట్టు? చరణ్ తండ్రి పాత్రలో రెహమాన్ నటిస్తున్నాడు. కానీ అతనికి టీజర్‌లో కానీ, పోస్టర్స్‌లో కానీ చోటు దక్కలేదు.
ఎందుకంటే ప్రధానంగా ఈ కథ ప్రకాష్‌రాజ్, చరణ్, శ్రీకాంత్ క్యారెక్టర్ల చుట్టూనే తిరుగుతుంది. తండ్రి పాత్రకి అంత ఇంపార్టెన్స్ లేదు. అయినా కానీ క్రేజ్ వస్తుందని తండ్రి పాత్రని జగపతిబాబుతో చేయిద్దామని చూసారు. జగపతిబాబుకి మంచి ప్యాకేజ్ ఇస్తామని చెప్పినా కానీ అతను టెంప్ట్ కాలేదు.
లెజెండ్ తర్వాత ఇప్పుడు మహేష్‌బాబు సినిమాలో చేస్తున్న జగపతిబాబు ఈ పాత్ర చేయకపోవడమే మంచిదైంది. కనీస ప్రాధాన్యం లేని ఆ పాత్ర చేయడం వల్ల తన క్రేజ్ తగ్గిపోయేది. ఇదిలావుంటే గోవిందుడు అందరివాడేలే అందరూ మెచ్చే సినిమాగా రూపు దిద్దుకుంటోందని, మంచి ఫ్యామిలీ సినిమాగా నీరాజనాలు అందుకుంటుందని టాక్ వినిపిస్తోంది.