వరుసగా మూడు పరాజయాలతో డౌన్ అయిన హీరో రామ్ తన తదుపరి చిత్రం షేపప్ అవుతున్న తీరు పట్ల చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమాతో సూపర్‌హిట్ సాధించి, ఫ్లాపులకి బ్రేక్ వేస్తాననే ధీమా అతనిలో కనిపిస్తోంది. బలుపుకి ముందు వరుస పరాజయాలని చవిచూసిన రవితేజకి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇప్పుడు రామ్‌తో సేమ్ ఫీట్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు.
పండగ చేస్కో కథపై ఏడాది పాటు వర్క్ చేసిన గోపీచంద్ మలినేని దీనిని పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడట. రామ్‌కి మళ్లీ ఒక రెడీలాంటి మైల్‌స్టోన్ ఇది అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రంలో కామెడీ, యాక్షన్, రొమాన్స్, మ్యూజిక్ అన్నీ ది బెస్ట్ అనిపించేలా కేర్ తీసుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిస్తున్నారు.
కందిరీగ ఇచ్చిన జోష్‌ని క్యాష్ చేసుకోలేకపోయిన రామ్ ‘పండగ చేస్కో’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చి కోల్పోయిన తన మార్కెట్‌ని తిరిగి సాధించాలని చూస్తున్నాడు. ఇది కనుక రామ్‌కి బ్రేక్ ఇచ్చినట్టయితే డైరెక్టర్‌గా గోపీచంద్ మలినేని నెక్స్‌ట్ లెవల్‌కి వెళ్లడం గ్యారెంటీ. ఫ్లాపుల్లో ఉన్న హీరోలకి బ్రేక్ ఇవ్వడమంటే ఆషామాషీ కాదుగా మరి.