Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనిల్ కు భలే డిమాండ్

అనిల్ కు భలే డిమాండ్

టాలీవుడ్ నే కాదు, ఏ రంగం అయినా సక్సెస్ వెనుకే పరుగెడుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీ డైరక్టర్ అనిల్ రావిపూడి వెనుక పరుగిడుతోంది అందుకే. కేఎస్ రామారావు, ఎన్బీకే ఫిలింస్, ఇంకా మరో ఒకటి రెండు సంస్థలు అనిల్ రావిపూడి సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటివరకు అనిల్ రావిపూడికి ఫ్లాపులు అయితే లేవు. దిల్ రాజు బ్యానర్ లోనే మూడు సినిమాలు చేసారు. ఒకటి బయట చేసారు.

ఇప్పుడు కూడా మరో ఒకటి మాత్రమే బయట చేసి, మళ్లీ దిల్ రాజు బ్యానర్ కు వస్తారని తెలుస్తోంది. అయితే ఈ బయట సినిమాను ఎవరు నిర్మిస్తారన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. అనిల్ రావిపూడి ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు. ఆ హీరో ఏ నిర్మాతతో కంఫర్టబుల్ అన్నది తేలితే, బ్యానర్ డిసైడ్ అవుతుంది.

బాలయ్యతో సినిమా అన్నది వినిపిస్తోంది కానీ, అది వుంటుందా? అన్నది అనుమానం. ఎందుకంటే బాలయ్య బోయపాటి సినిమా అన్నది ఫిక్స్. కానీ ఒక పక్క ఎన్నికల వాతావరణంలో ఎప్పుడు ప్రారంభమై, ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు. అంతవరకు వెయిటింగ్ లో వుండాలి అనిల్ రావిపూడి.

అలా కాకుండా హీరో ఎవరైనా దొరికితే బోయపాటి సినిమా అక్కడ అయ్యేలోగా అనిల్ రావిపూడి ఇక్కడ ఓ సినిమా చేసేయచ్చు. అయితే హీరోలు ఎవ్వరూ ఖాళీలేరు. తనకోసం ఎవరు డేట్ లు అడ్జస్ట్ చేయగలరు అన్నది ఇప్పుడు క్వశ్చను. అది తేలాలి. కానీ ఈలోగా అనిల్ డేట్ ల కోసం నిర్మాతల ప్రయత్నాలు మాత్రం ఆగడంలేదు.

ఇదిలా వుంటే.. ప్రస్తుతం మూడుకోట్ల దగ్గర వున్న అనిల్ రావిపూడి రెమ్యూనిరేషన్ ఇప్పుడు అయిదుకోట్లు దాటేసిందని తెలుస్తోంది.

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?