Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'మహానాయకుడు' ముందే బయటకు

'మహానాయకుడు' ముందే బయటకు

నిన్నటి వరకు 'నేను.. నా కుంపటి' అన్నట్లు వుంది మీడియా వ్యవహారం. ఆ రెండు పత్రికలు జనాలను ఎటు అదలిస్తే అటే వెళ్లాలి. ఎటు కదిలిస్తే అటే కదలాలి. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. సోషల్ నెట్ వర్క్, ముఖ్యంగా యూట్యూబ్ మీడియా లాంటి ఫ్రీడమ్ ప్రెస్ వచ్చేసింది. జనాలకు చేరాల్సిన అభిప్రాయాలు చేరిపోతున్నాయి. ఇప్పటికీ 'సామాజిక' సంకెళ్లలో బందీ అయిపోయిన మీడియా అలానే వుంది. తెలుగుదేశానికి అనుకూలంగా అలాగే టముకు వేస్తూనే వస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్-నాదెండ్ల ఎపిసోడ్ సినిమాగా వస్తోంది. అప్పట్లో ఏం జరిగింది అన్నది అప్పటి మీడియా ఏం చెప్పిందో తప్ప, కాయిన్ కు మరోసైడ్ తెలియదు.అప్పట్లో యూట్యూబ్ లు లేవు, వెబ్ సైట్లు లేవు. అందువల్ల నాదెండ్ల వెర్షన్ బయటకు రాలేదు. నాదెండ్ల మొత్తుకున్నా ప్రచురించే మీడియా లేదు.

కట్ చేస్తే, ఇప్పుడు అదే కథ సినిమాగా రాబోతోంది. ఈ సినిమాలో నారా చంద్రబాబు క్యారెక్టర్ ను హీరో రానా చేస్తున్నారు. అంటే కచ్చితంగా నాదెండ్ల పాత్ర విలన్ గా కాకపోయినా, నెగిటివ్ గానే వుంటుంది. అలాగే కేంద్రంపై ఫైట్ వుంటుంది. టోటల్ గా ఎన్టీఆర్ ను ఆయనతో పాటు నారా చంధ్రబాబును హీరోలుగా చూపించడం పక్కా.

ఇదంతా ఫిబ్రవరిలో తెరపైకి వస్తుంది. కానీ ఈలోగానే మొత్తం అసలు వ్యవహారం బయటకు వచ్చేసింది. అందుబాటులోకి వచ్చిన యూట్యూబ్ మీడియాను సీనియర్ పొలిటీషియన్ నాదెండ్ల భాస్కరరావు పూర్తిగా వాడుకున్నారు. మొత్తం ఆంధ్ర జనానికి అప్పట్లో ఏం జరిగిందో? అసలు ఎన్టీఆర్ ఏమిటో? చంద్రబాబు ఏమిటో? విడమరిచి చెప్పేసారు.

అడిగిన చానెల్, అడగని చానెల్ అనేదిలేదు. మొత్తం యూట్యూబ్ లోనే టముకు వేసేసారు. దీంతో ఇప్పడు మహానాయకుడులు ఏం చెబుతారో కానీ, దానికి కౌంటర్ మాత్రం ముందే బయటకు వచ్చేసింది. అంటే ఎవరైనా పొరపాటున మహానాయకుడు చూసినా, ఇదంతా మాకు ముందే తెలుసు. నాదెండ్ల మొత్తం చెప్పేసాడుగా అని లైట్ తీసుకుంటారు.

పాపం, చంద్రబాబును తెలుగుదేశాన్ని, ఎన్టీఆర్ ను కాపాడే హీరోగా చిత్రీకరిద్దామనుకున్నా, ముందుగానే నాదెండ్ల ఆ వ్యూహాన్ని భగ్నం చేసేసాడు. 

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?