పుత్రోత్సాహము, విజయోత్సాహము కన్నా సంతోషకర సంఘటనలు ఏముంటాయి. దర్శకుడు అనిల్ రావిపూడికి ఇప్పుడు అలాంటి సంతోషమే కలుగుతోంది. కొత్త ఏడాది ప్రారంభంలో అనిల్ రావిపూడి మరోసారి తండ్రి అయ్యారు. ఆయనకు ఇప్పటికే ఓ కుమార్తె వుండగా, ఇప్పడు కొడుకు పుట్టాడు.
ఒక పక్క మహేష్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా, ఫైనల్ వర్క్, అదే సినిమా భారీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో వుండగా, ఇంకో పక్క తండ్రి అయిన శుభవార్త అందింది. హీరో దగ్గర నుంచి అందరి అభినందనలు వెల్లువెత్తాయి. రెయిన్ బో ఆసుపత్రిలో తల్లీ బిడ్డ క్షేమంగా వున్నారు.
అనిల్ రావిపూడి దర్శకుడిగి వరుస విజయాలతో ఎదుగుతూ వస్తున్నారు. ఇప్పుడు దాదాపు శిఖరం పైకి చేరుకున్నారు. మహేష్ తో చేస్తున్న సరిలేరు సినిమాలో ఆయన టాప్ లీగ్ లోకి చేరిపోబోతున్నారు.