ఎఫ్ 2 సినిమాతో టాప్ లైన్ డైరక్టర్ల జాబితాలోకి చేరిపోయారు అనిల్ రావిపూడి. పెద్ద డైరక్టర్లు శ్రీనువైట్ల, వివి వినాయక్ లాంటివాళ్లు రిటైర్డ్ స్టేజ్ లో వుంటే, బోయపాటి, పూరి జగన్నాధ్, లాంటి వాళ్లు స్ట్రగుల్ పడుతున్నారు. కేవలం త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల, సురేందర్ రెడ్డి లాంటి కొద్దిమంది మాత్రమే మిగిలారు.
ఇలాంటి టైమ్ లో మీడియం బడ్జెట్ తో బ్లాక్ బస్టర్ కొట్టడం అంటే తమాషా కాదు. అందుకే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ ను, అనిల్ రావిపూడిని కలపాలన్న ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే మహేష్ ప్రస్తుతం సుకుమార్ సినిమా ప్రారంభించి ఫినిష్ చేయాల్సి వుంది.
ఎప్పుడు అన్న సంగతి పక్కన పెడితే ముందు ప్రాజెక్టు ఫైనల్ కార్యక్రమాలు షురూ అయినట్లు టాక్. నిర్మాత అనిల్ సుంకర, మహేష్ బాబు స్వంత బ్యానర్ ఎంబీ ప్రొడక్షన్స్ కాంబినేషన్ లో ఈ సినిమా వుంటుందన్న టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయింది.
మరో కొద్దిరోజుల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పాజిటివ్ న్యూస్ బయటకు వస్తుందని తెలుస్తోంది. మహేష్ బాబు కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేసి చాలాకాలం అయింది. ఈ కాంబినేషన్ కచ్చితంగా క్రేజీగా వుంటుంది.
ఇదిలావుంటే అనిల్ రావిపూడి నిర్మాత సాహుకు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా, అలాగే దిల్ రాజు ఎఫ్ 3 సినిమాలు చేయాల్సి వుంది.