పెనమలూరు నుంచి చంద్రబాబు?

కొడుకు లోకేష్ కు వారసత్వ పగ్గాలు అందించడం అన్నది చంద్రబాబు ఎప్పడో ప్రారంభించారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దింపకుండా ఎమ్మెల్సీకి పంపించి, మంత్రిని చేసారు. దానిపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. జనసేన అధిపతి…

కొడుకు లోకేష్ కు వారసత్వ పగ్గాలు అందించడం అన్నది చంద్రబాబు ఎప్పడో ప్రారంభించారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దింపకుండా ఎమ్మెల్సీకి పంపించి, మంత్రిని చేసారు. దానిపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ అయితే తరచూ అదే పాయింట్ లేవనెత్తుతుంటారు. అందుకే ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని లోకేష్ డిసైడ్ అయ్యారు.

కొడుకుకు అధికార వారసత్వంతో పాటు నియోజకవర్గ వారసత్వం కూడా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు బోగట్టా. అయితే ముందుగా చంద్రగరి నియోజకవర్గాన్ని లోకేష్ కోసం పరిశీలించినట్లు, కానీ తరువాత మనసు మార్చుకుని కుప్పం నుంచే పోటీ చేయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ విధంగా కంచుకోట లాంటి తన నియోజకవర్గాన్ని కొడుక్కు వారసత్వంగా ఇచ్చేసినట్లు అవుతుంది.

ఇక చంద్రబాబు తొలిసారి రాయలసీమ నుంచి బయటకు వచ్చి, కృష్ణాజిల్లా పెనమలూరు నుంచి పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం గెలుపు నల్లేరు మీద బండి నడకలా వుంటుందని తెలుగుదేశం భావిస్తోంది. ఎందుకంటే గత నాలుగేళ్లలో అభివృద్ధి అనేది ఏదయినా వుంటే అదంతా అక్కడే కేంద్రీకృతమైంది. అందుకే ఈసారి బాబు అక్కడ నుంచి పోటీ చేస్తారని వినిపిస్తోంది.

ఇదిలావుంటే మరికొన్ని హాట్ సీట్ లు కూడా వార్తల్లో వినిపిస్తున్నాయి. వీటిలో హిందూపురం ఎంపీగా మంత్రి పరిటాల సునీత కొడుకు శ్రీరామ్ పోటీ చేస్తారని టాక్. అలాగే వైకాపా చిత్తూరు ఎంపీ సీట్ కోసం వివాదాస్పద సామాజిక కార్యకర్త కత్తి మహేష్ ప్రయత్నిస్తున్నారని టాక్. హీరో నిఖిల్ కు మామ వరసైన ఆర్కె కొండయ్య విశాఖ ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబుపై పోటీకి తలపడతారని వినిపిస్తోంది.

విజయవాడలో ఎంపీ  పదవికి కేశినేని నాని మీద పోటీగా సినిమా నిర్మాత, బిజినెస్ మన్ పివిపి పోటీచేస్తారని తెలుస్తోంది. మాజీమంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశంలోకి వచ్చి, ఎంపీగా పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

అనంతపురంలో వీళ్లు ఔట్?… కర్నూలులోనూ అదే కథ!

రెండు భారీ డిజాస్టర్లలో ఒకటైన ఎన్టీఆర్‌ కథానాయకుడు