ఎర్రచందనం అక్రమరవాణా చేసే మాఫియా నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం సుకుమార్ లైన్ చెప్పారు. కానీ పూర్తి స్క్రిప్ట్ మాత్రం ఎంతకూ ఫైనల్ కావడం లేదని వినికిడి. నిన్ననో మొన్ననో సుకుమార్ కొంత నెరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఫుల్ నెరేషన్ కాలేదని, ముక్కలు ముక్కలుగా, పార్ట్ లు పార్ట్ లుగా తయారవుతోందని వినికిడి.
దీనివల్ల మహేష్ ఇంకా స్క్రిప్ట్ మీద పూర్తిగా డెసిషన్ తీసుకోలేదని టాక్. వన్ సినిమా ఫలితం నేపథ్యంలో సుకుమార్ పట్ల ఈసారి మహేష్ చాలా జాగ్రత్తగా వున్నారు. వాస్తవానికి రంగస్థలం కథ సుకుమార్ స్వంతం కాదని, ఆయన సహాయకుడు బుచ్చిబాబుది అని, ఇప్పుడు సహాయకులు అందరూ డైరక్టర్లు అయిపోతుంటే, సుకుమార్ కు స్క్రిప్ట్ తయారుచేయడం కాస్త కష్టం అవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ లెక్కన వచ్చే సమ్మర్ కు కానీ మళ్లీ మహేష్ సినిమా వుండకపోవచ్చని కూడా టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి టార్గెట్ గా సినిమా చేయాలి అంటే మేలో మొదలుపెట్టి ఆరేడు నెలల్లో ఫినిష్ చేయాలి. కానీ సుకుమార్ అంత త్వరగా వేగంగా చేయగలరా? అన్నది అనుమానం. పైగా అదే సంక్రాంతికి అయితే సైరా, లేదా బన్నీ-త్రివిక్రమ్ సినిమా వుండే చాన్స్ వుంది.
అందువల్ల సుకుమార్ స్క్రిప్ట్ కూడా లీజర్ గానే చెక్కుతున్నట్లుంది. మహేష్ కూడా ఆచితూచి వున్నారు. అన్నీ బాగానే వున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితులను నమ్ముకుని అనిల్ రావిపూడి మహేష్ దగ్గర స్టక్ అయితే ఓ ఏడాది అంతా వృధా కావడం గ్యారంటీ.