వాస్తవానికి అనిల్ రావిపూడి రూపొందించిన ఎఫ్ 2 లో సీన్లకూ.. ఇదే దర్శకుడు మహేశ్ బాబుతో రూపొందించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని సీన్లకూ కొంత పోలిక ఉంటుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలతో రష్మిక, ఆమె తల్లి పాత్ర చేసిన సంగీత, ఇద్దరు అక్క పాత్రలు.. వారి శాడిస్టిక్ తెలివితేటల సీన్లను గమనిస్తే, వాటిల్లో ఎఫ్ 3 జాడ కనిపిస్తుంది.
కేడీ తరహాల్లో ఆలోచించే ఆడ పాత్రలు రెండు సినిమాల్లోనూ కామన్. ఎఫ్ 2 కోసం రాసుకోగా మిగిలిపోయినో, ఎఫ్ 2 లో అతకని సీన్లనో తెచ్చి సరిలేరు నీకెవ్వరు లో హీరోయిన్ ట్రాక్ అంతా అల్లేసినట్టుగా అగుపిస్తుంది. మరి అదే అనుకుంటే.. ఎఫ్ 3లో అవే మేనరిజమ్స్, అవే డైలాగులు.. అవే ఆడపాత్రలు ఏవో సందేహాలను రేపుతూ ఉన్నాయి.
ఈ సినిమా సూటిగా ఎఫ్ 2కు కొనసాగింపు కానట్టుగా ఉంది కానీ, ఆ పాత్రల తీరుతెన్నులు మాత్రం.. ఎఫ్ 2 జాడలోనే ఉన్నాయి. దీంతో ఎఫ్ 2లో మిగిలిపోయిన సీన్లు ఉంటే.. అవే ఎఫ్ 3 అయ్యాయా.. అనే సందేహాలు రైజ్ అవుతున్నాయి.
ఎఫ్ 2కు సీక్వెల్ అయతే అయ్యింది కానీ, అయితే ఎఫ్ 3లో ఎఫ్ 2 వాసనే గుప్పు మంటే మాత్రం భరించడం కష్టమే కావొచ్చు. సరిలేరు సినిమాలోనే హీరోయిన్ ట్రాక్ ఒక దశలో వికటించింది. హీరో తనను రేప్ చేశాడంటూ హీరోయిన్ చేసే సీన్ జుగుప్సను కలిగించే వరకూ వెళ్లింది.
రష్మిక ఓవరాక్షన్ విసిగించింది. చివరకు ఆ పాత్రను తను సొంత ఆలోచనలతో అలా చేయలేదని, కేవలం దర్శకుడు చెప్పిందే చేసినట్టుగా రష్మిక విడుదలయ్యాకా ఏదో కవర్ చేసుకునే యత్నం చేసింది. మరి ఎఫ్2 హ్యాంగోవర్ నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి ఎంత వరకూ బయటకు వచ్చారో!