Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనిల్ రావిపూడితో కళ్యాణ్ రామ్?

అనిల్ రావిపూడితో కళ్యాణ్ రామ్?

కళ్యాణ్ రామ్ కు పటాస్ లాంటి మాంచి హిట్ ఇచ్చి లైమ్ లైట్ లోకి వచ్చాడు అనిల్ రావిపూడి. ఆ తరువాత దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసాడు. ఆపై మరో సినిమా చేసే ప్రయత్నాల్లో వున్నాడు. తన దగ్గర వున్న ఓ స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ ను ఇంప్రెస్ చేసే పనిలో వున్నాడు. ఇదిలా వుంటే, అనిల్ దగ్గరే మరో మాంచి మాస్ ఎంటర్ టైనర్ సబ్జెక్ట్ వుందని, అది కళ్యాణ్ రామ్ కు సూటవుతుందని తెలుస్తోంది. 

ఒకవేళ ఎన్టీఆర్ తో సినిమా సెట్ కాకపోతే, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కించే ఆలోచనలు జరుగుతున్నాయట. అయితే ఈ సినిమా కళ్యాణ్ రామ్ ఓన్ బ్యానర్ లో వుంటుందా? దిల్ రాజు బ్యానర్ లో వుంటుందా? అన్నది కూడా ఇంకా తేలాల్సి వుంది. ఇప్పటికి ఇది జస్ట్ ఆలోచనల స్టేజ్ లోనే వుందట. 

ఎన్టీఆర్ నిర్ణయం మేరకు కళ్యాణ్ రామ్-అనిల్ రావిపూడి సినిమా వుండే అవకాశం వుంటుంది. అంటే ఏదయినా నందమూరి క్యాంప్ లోనే అనిల్ సినిమా వుంటుందన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?