ఒక్కోసారి టైమ్ భలేగా వుంటుంది. రావాల్సిన అప్రిసియేషన్ కూడా రాకుండా పోతుంది. కళ్యాణ్ రామ్ నుంచి మహేష్ బాబు దాకా ఎదుగుతూ వచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ ఏజ్, ఆ రేంజ్ డైరక్టర్లు అసూయపడే రేంజ్ కు చేరుకున్నాడు. టాప్ ఫైవ్ డైరక్టర్ల తరువాత ఆ లైన్ లోకి వచ్చే డైరక్టర్ తనే అనేంతగా ఎదిగాడు. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమా అతన్ని మానసింకంగా చాలా బాధపెట్టింది.
అంటే సినిమా బాధపెట్టింది అన్నది కాదు, రెండు భారీ సినిమాలకు మధ్య పోటీ, రెండింటి నుంచి వచ్చిన అనేక రకాల కలెక్షన్ ఫిగర్లు, ఫ్యాన్స్ మధ్య పోటీ ఇవన్నీ కలిసి, అనిల్ రావిపూడికి రావాల్సిన క్రెడిట్ రాకుండా చేసేసాయి. త్రివిక్రమ్-బన్నీ లాంటి కాంబినేషన్ కు పోటీగా మహేష్-అనిల్ రావిపూడి సినిమా వచ్చింది. రెండు సినిమాల్లో అల సినిమా బెటర్ అనిపించుకుంది. భారీ కలెక్షన్ల సాధించింది.
అయితే అలా అని సరిలేరు సినిమాను కూడా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే అంత భారీ రేట్లకు, ఆంధ్రలో 40 కోట్ల రేషియోలో సినిమా అమ్మితే, బయ్యర్లు సేఫ్ అయ్యారు అంటే అది కూడా హిట్ సినిమానే. నైజాంలో రకరకాల ఫిగర్లు చలామణీలో వున్నాయి. అందువల్ల దేనినీ నమ్మలేం. కానీ ఒకటి వాస్తవం. నైజాంలో కూడా ముఫై కోట్ల దగ్గరలో చేసింది అన్నది పక్కా. ఆ విధంగా కూడా సినిమా సూపర్ హిట్ నే.
కానీ 'అల' హడావుడిలో సరిలేరు విజయం పక్కకు పోయింది. పైగా ఎప్పుడయితే తొలినాళ్లలో రకరకాల ఫిగర్లు వదిలి హడావుడి చేసారో, రాను రాను అల నిలబడి, సరిలేరు సెకెండ్ ప్లేస్ లోకి వెళ్లిపోయిందో, దాని విజయం లెక్కలోకి రాకుండా పోయింది. పైగా సరిలేరు టీమ్ కూడా వున్నట్లుండి సైలంట్ అయిపోయింది. అదే టైమ్ లో అల టీమ్ హడావుడి మొదలయింది. వచ్చిన విజయాన్ని మరింత గ్లోరిఫై చేయాలన్నట్లుగా బన్నీ వరుసగా పార్టీలు హడావుడిలు ప్రారంభించారు. దీంతో సరిలేరు విజయం మరింత వెనక్కు వెళ్లిపోయింది.
ఇలాంటి నేపథ్యంలో త్రివిక్రమ్ లాంటి దిగ్దర్శకుడి విజయం ముందు, అనిల్ రావిపూడి లాంటి సక్సెస్ ఫుల్ డైరక్టర్ విజయం వెలవెల బోయేలా చేసింది. ఎఫ్ 2 కన్నా పెద్ద విజయం కలెక్షన్ల పరంగా సరిలేరు సినిమాది. కానీ ఇక్కడ మహేష్ వుండడంతో విజయంలో పాలు ఆయనకు ఎక్కువ అనిల్ కు తక్కువ వేసారు. ఆ విధంగా కూడా పాపం, అనిల్ రావిపూడి నిరాశే మిగిలింది.
గమ్మత్తు ఏమిటంటే, అల విజయం బన్నీ ఖాతాలో కాకుండా త్రివిక్రమ్ ఖాతాలో పడితే, సరిలేరు విజయం అనిల్ ఖాతాలో కాకుండా మహేష్ ఖాతాలో పడడం. ఇక ఇప్పడు మిగిలింది ఒకటే. అనిల్ రావిపూడి మరో సినిమా చేసి, వరుసగా మరో సక్సెస్ కొట్టి, తనేంటో మరోసారి చూపించడం. అంతే తప్ప, జరిగిపోయిన దాని గురించి పోస్ట్ మార్టం చేస్తూ బాధపడడం అనవసరం.
కొన్ని కొన్ని అలా చూసీ చూడనట్లు వదిలేయాలి డ్యూడ్.