Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వీడు మామూలోడు కాదు... త్రివిక్రమ్ కే పంచ్

వీడు మామూలోడు కాదు... త్రివిక్రమ్ కే పంచ్

జెర్సీ సూపర్ హిట్ అయింది. యూనిట్ అంతా ఆనందంలో మునిగి తేలుతోంది. ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖులు యూనిట్ ను మెచ్చుకుంటున్నారు. ట్వీట్లు, రీట్వీట్లుతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అనిరుధ్ పెట్టిన ట్వీట్ మాత్రం ఎవరికీ అర్థంకాలేదు. జెర్సీకి మ్యూజిక్ అందించిన అనిరుధ్, సినిమా హిట్ అయినందుకు థ్యాంక్స్ చెబుతూనే రజనీకాంత్ కు చెందిన ఓ వీడియో పెట్టాడు.

జెర్సీ హిట్ అయితే రజనీకాంత్ వీడియో ఎందుకు పెట్టాడో ఎవరికీ అర్థంకాలేదు. అంతా నాన్-సింక్ అనుకున్నారు. పొరపాటు జరిగి ఉండొచ్చని మరికొందరు సర్దుకున్నారు. కానీ ఆ వీడియోలో డైలాగ్, టాలీవుడ్ కు సంబంధించి అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ ఒకసారి కలిపి చూస్తే ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది.

"నా పనైపోయిందనుకున్నావా.. అంటూ వీడియోలో రజనీకాంత్ ఓ స్మైల్ ఇస్తాడు. అది ఎప్పటికీ జరగదు, నేను బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉంటాననే అర్థం వచ్చేలా ఉంది ఆ వీడియో. కేవలం త్రివిక్రమ్ ను దృష్టిలో పెట్టుకొనే అనిరుధ్ ఆ వీడియోను విడుదల చేసి ఉంటాడని చాలామంది భావిస్తున్నారు.

అజ్ఞాతవాసితో అనిరుధ్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు త్రివిక్రమ్. కానీ అదికాస్తా డిజాస్టర్ అవ్వడంతో నెక్ట్స్ సినిమాకు అతడ్ని పక్కనపెట్టాడు. ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాకు అనిరుధ్ పేరును ప్రకటించి, అతడ్ని ప్రారంభోత్సవానికి పిలిచి మరీ పక్కనపెట్టాడు. దీనిపై అప్పట్లో అనిరుధ్ బాగా హర్ట్ అయ్యాడు. ఆ తర్వాత మరో 2 ఆఫర్లు కూడా మిస్ అయ్యాడు.

ఎట్టకేలకు జెర్సీతో టాలీవుడ్ లో మొట్టమొదటి హిట్ అందుకున్నాడు అనిరుధ్. ఈ సందర్భంగా త్రివిక్రమ్ ను ఉద్దేశించి అనిరుధ్, ఈ వీడియో పోస్ట్ చేసి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. ఓవరాల్ గా ఆలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది ఎవరికైనా.

మేము చాలా రిస్క్ చేసాం.. నిఖిల్, లావణ్య ఫన్నీ ఇంటర్వ్యూ

నా మనసులో ఏది ఉంటే అదే చేస్తా.. మంచివాళ్ళకే సపోర్ట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?