Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మార్కెట్‌ని దెబ్బకొట్టిన రాజమౌళి

మార్కెట్‌ని దెబ్బకొట్టిన రాజమౌళి

అసలే స్టార్‌ హీరోలు ఆచి తూచి సినిమాలు చేస్తుంటారు. కాకపోతే కనీసం ఏడాదిలో ఒకటయినా పూర్తి చేసి విడుదల చేస్తుంటారు. ఉన్న స్టార్‌ హీరోలే కొద్ది మంది అంటే, వారిలో ఇద్దరిని రాజమౌళి లాక్‌ చేసేసాడు. రాజమౌళితో సినిమా చేస్తే తర్వాత ఏ రేంజ్‌కి మార్కెట్‌ వెళుతుందనేది ఊహించడం కష్టం కాబట్టి తదుపరి చిత్రాల గురించి కూడా హీరోలు ఆలోచించరు. దీని వల్ల ఉన్న అరడజను మంది హీరోల్లో ఇద్దరు అందుబాటులో లేకుండా పోయారు.

మరోవైపు పవన్‌కళ్యాణ్‌ కూడా వాలెంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. ఒకేసారి స్టార్‌ హీరోల్లో చాలా మంది మిస్‌ అయిపోయేసరికి సీజన్‌లో కూడా భారీ సినిమాలు ఎక్కువ వచ్చేలా లేవు. సమ్మర్‌ అంతటికీ మహేష్‌ 'మహర్షి' ఒకటే భారీ సినిమా కాగా, ఆ తర్వాత ప్రభాస్‌ 'సాహో' ఒకటే గ్యారెంటీగా రిలీజ్‌ అయ్యే సినిమాల లిస్టులో వుంది. ఇక మిగతా సినిమాలన్నీ ప్రస్తుతానికి ప్రకటనలు మాత్రమే.

మల్టీస్టారర్‌లో ఇద్దరు బడా హీరోలు కలిసి నటించడమనేది ఎక్సయిట్‌ చేయడమేమో కానీ ఏడాదికి గ్యారెంటీగా వచ్చే సినిమాలకి గండి పడి మార్కెట్‌ మీద ఆ ఎఫెక్ట్‌ బలంగా పడింది. ఆర్‌.ఆర్‌.ఆర్‌. షూటింగ్‌ ఈ ఏడాది చివరకు పూర్తి చేస్తానని రాజమౌళి ప్రకటించినా కానీ ప్రోగ్రెస్‌ మాత్రం అనుకున్న విధంగా సాగడం లేదని అంటోంది ఇండస్ట్రీ. 

మేము చాలా రిస్క్ చేసాం.. నిఖిల్, లావణ్య ఫన్నీ ఇంటర్వ్యూ

నా మనసులో ఏది ఉంటే అదే చేస్తా.. మంచివాళ్ళకే సపోర్ట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?