హీరోలకి ఏళ్ల తరబడి డిమాండ్ వుంటుంది కానీ హీరోయిన్లకి మాత్రం షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. కనీసం పాపులర్ హీరోయిన్లకి అయినా ఈమధ్య ఎక్కువ కాలం అవకాశాలు వస్తున్నాయి. అయితే కెరీర్ పొడిగించుకోవడం ఎలాగనేది హీరోయిన్లకి తెలిసుండాలి. ఉదాహరణకి రకుల్ ప్రీత్ సింగ్‌నే తీసుకుంటే, రెండేళ్ల పాటు ఒక ఊపు ఊపేసిన రకుల్‌కి సడన్‌గా అవకాశాలు తగ్గిపోయాయి.
పలు చిత్రాల్లో తన పేరు పరిశీలనకి తీసుకుని కూడా తర్వాత కాదనుకున్నారు. యువ హీరోలంతా రకుల్‌ని కాదంటోన్న వేళ ఆమె ఒక కొత్త చిట్కా కనుగొంది. తనతో నటించడానికి యువ హీరోలు లేకపోతే, తను నటిస్తే సంబరపడే సీనియర్లతో నటించడానికి సిద్ధపడింది. అయితే ఏజ్డ్ హీరోలతో నటించినా కానీ అందులో తన వయసు వారితో సమానం కాదన్నట్టు, వయసు రీత్యా చాలా వ్యత్యాసం వున్నట్టు తన పాత్రని తీర్చిదిద్దేలా జాగ్రత్తపడింది.
అలాగే అజయ్ దేవ్‌గన్‌తో 'దే దే ప్యార్ దే'తో పాటు నాగార్జునతో 'మన్మథుడు 2' చేస్తోంది. రకుల్ అంత పెద్ద హీరోలతో నటించేస్తోందని అనుకోకుండా, సినిమాలు రిలీజ్ అయిన తర్వాత తన ఏజ్‌కి తగ్గ ఇమేజే కంటిన్యూ అయ్యేలా కేర్ తీసుకుంది. సీనియర్లతో నటించినందుకు గాను ఆమెకి పారితోషికం కూడా గట్టిగానే లభించింది.