పేరు కోయిన్సైడ్ అయిందని కానీ, గీతాంజలి సినిమాకు ఏ హీరోయిన్ అయినా ఒకటే. సబ్జెక్ట్ అలాంటిది. ఇప్పుడు ఆ గీతాంజలి సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. అయితే టీమ్ లో చాలా మార్పులు జరుగుతున్నట్లు వినికిడి.
గీతాంజలి నిర్మాత ఆసక్తి చూపించలేదో ఏమిటో, అందువల్ల క్రేజీ మీడియా పతాకంపై చినబాబు దీన్ని నిర్మిస్తారు. అలాగే మరోకీలకమైన మార్పు ఏమిటంటే, అంజలి బహుశా ఈ సినిమాలో చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆమె రేంజ్ పెరిగిపోయింది.
తన పాత్ర కీలకం అంటే చాలు 75లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. కథకుడు కోన వెంకట్ కదా,,ఏదో మాయ చేసి, హీరోయిన్ ను మార్చేస్తారు. లేదూ అంజలి దిగివస్తే ఓకె అంటారు. శ్రీనివాస రెడ్డి మాత్రం ఓకెనట. రాజ్ కిరణే దర్శకుడు.