Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అన్నీ వాడేస్తోన్న కళ్యాణ్‌

అన్నీ వాడేస్తోన్న కళ్యాణ్‌

అతనొక్కడే తప్ప ఇన్నేళ్ల కెరీర్‌లో మరో హిట్‌ లేని కళ్యాణ్‌రామ్‌ ఈమధ్య ఓం 3డి, కత్తిలాంటి చిత్రాలు తీసి ఆర్థికంగా బాగా నష్టపోయాడు. హీరోగా నిలబడాలని ఎంత ట్రై చేస్తున్నా కళ్యాణ్‌రామ్‌కి టైమ్‌ కలిసి రావట్లేదు. త్వరలో విడుదల కాబోతున్న ‘పటాస్‌’తోనే తాడో పేడో తేల్చుకుందామని చూస్తున్నాడు. 

ఈ చిత్రం ట్రెయిలర్లు అవీ చూస్తుంటే సినిమాలో విషయం ఉన్నట్టే కనిపిస్తోంది. కేవలం తనని, కథని నమ్ముకుని భారం దేవుడి మీదో, నందమూరి అభిమానుల మీదో వేసేయకుండా కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రానికి తనకి ఉన్న లైఫ్‌ లైన్స్‌ అన్నీ వాడేస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ పాటని రీమిక్స్‌ చేసి పెట్టుకున్న కళ్యాణ్‌రామ్‌ బాబాయ్‌ పోస్టర్లని కూడా యూజ్‌ చేసాడు. 

కేవలం బాబాయ్‌ని మాత్రమే కాకుండా తన సోదరుడు ఎన్టీఆర్‌కి ఉన్న పాపులారిటీని కూడా క్యాష్‌ చేసుకోవడానికి చూస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఉంటుందని, పాత్రల్ని ఇంట్రడ్యూస్‌ చేయడానికి ఎన్టీఆర్‌ వాయిస్‌ వాడారని లేటెస్ట్‌ న్యూస్‌. అస్త్రాలన్నీ వాడేసిన కళ్యాణ్‌కి ‘పటాస్‌’తో సక్సెస్‌ వచ్చేస్తుందో లేదో మరి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?