బాలీవుడ్ నుంచి మరో బ్రేకప్ వార్త వినిపిస్తోంది. యంగ్ హీరోయిన్ అనన్య పాండే, ఆమె సన్నిహితుడు ఇషాన్ ఖట్టర్ లు విడిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మూడేళ్ల నుంచి అత్యంత సన్నిహితులుగా చలామణి అయిన వీరిద్దరూ .. హుందాగా విడిపోయారట.
రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా చెప్పకుండానే, అందులో కొనసాగిన వీరిద్దరూ.. తమ జంట ప్రయాణాన్ని ముగించారని సమాచారం. వీరిద్దరూ చెరోదారి చూసుకున్నారని.. కొత్త రిలేషన్ షిప్ లతో వీరు ముందుకు సాగవచ్చని బాలీవుడ్ మీడియా అంచనా వేస్తోంది.
బాలీవుడ్ లో మోస్ట్ వాటెండ్ నటీమణిగా ఉన్న అనన్య పాండే, ఇదే సమయంలో ప్రాంతీయ భాషల మూవీ మేకర్స్ దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమె సై అంటే బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే లైగర్ లో కూడా నటిస్తోంది.
ఇక గతంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నాడు ఇషాన్ ఖట్టర్. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కు సవతి సోదరుడు అయిన ఇషాన్ కూడా వివిధ సినిమాలతో బిజీగానే ఉన్నాడు. జాన్వీ కపూర్ ఫస్ట్ డేటింగ్ చేసిన కుర్రాడిగా ఇతడికి చాలా గుర్తింపే వచ్చింది.
సినిమాలతో కన్నా.. ఇలా యంగ్ హీరోయిన్లతో సాన్నిహిత్యం ద్వారానే ఇతడికి హిందీ బెల్ట్ అవతల గుర్తింపు దక్కుతోంది. ఇన్నాళ్లూ అనన్యపాండే సన్నిహితుడిగా, ఇప్పుడు మాజీ ప్రియుడిగా నిలుస్తున్నాడు. మరి ఈ బ్రేకప్ తర్వాత.. అనన్య పాండే కొత్త ప్రియుడు ఎవరు అవుతాడో!