సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో కమెడియన్ షకలక శంకర్ ను హీరో పవన్ కళ్యాణ్ మందలించడమో, కొట్టడమో జరిగిందని వార్తలు గుప్పుమన్నాయి. ఇది జరిగి రోజులు గడిచాయి. మొదటి రోజు నుంచి నాలుగో రోజు వరకు ఖండించని షకలక శంకర్ అర్జెంట్ గా శనివారం ఖండించాడు. నిజానికి వార్తలు గుప్పుమన్న నాడే ఇటు పవన్ తరపున కానీ, షకలక శంకర్ తరపున కానీ ఖండన వెలువడాల్సి వుంది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు షకలక శంకర్ అర్జెంట్ గా ఖండించాడు..
అక్కడే వుంది కీలకం. సాయంత్రం పవన్ ప్రెస్ మీట్ అనగా ఉదయం షకలక శంకర్ ఖండన వెలువడింది. అంటే సాయంత్రం మరి ఇంక ఏ మీడియా ప్రతినిధి కూడా పవన్ ను ప్రశ్నించే చాన్స్ వుండదుగా. అదీ అసలు స్ట్రాటజీ. షకలక శంకర్ లాంటి చిన్న కమెడియన్, అది కూడా అతని తప్పు కాస్త వుందని తెలిసిన తరువాత, ఖండించు అంటే ఖండించక ఏం చేస్తాడు.
సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో ఏం జరిగిందన్నది యూనిట్ కే తెలుసు. మందలించారా..అంతకు మించి ఏం జరిగిందన్నది.ఏమీ జరగకుంటే మంచిదేగా? షూటింగ్ అన్నాక టెన్షన్లు సహజం. అలాంటి సమయంలో ఎవరి హద్దుల్లో వారు వుంటే ఇలాంటి ఖండనలు గట్రా ఇచ్చుకునే సమస్యలు రావు.