Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనుష్కకు కొరటాల కండిషన్

అనుష్కకు కొరటాల కండిషన్

సైరా సినిమా షూట్ చకచకా సాగుతోంది. అది పూర్తయితే కానీ, మెగాస్టార్ చిరంజీవి తన తరువాత సినిమా మీదకురారు. కొరటాల శివ డైరక్షన్ లో తయారయ్యే సినిమా అది. దానికోసం ఎప్పటి నుంచో కొరటాల వెయింటింగ్ లో వున్నారు. అయితే ఇలా వెయిటింగ్ లో వుంటూనే, సినిమాకు కావాల్సిన ప్రీ ప్రొడక్షన్ వ్యవహారాలు అన్నీ చక్క బెడుతున్నారు.

ఈ ప్రాజెక్టుకు కీలకమైనది హీరోయిన్. మెగాస్టార్ ఏజ్ కు, ఫిజిక్ కు, స్టార్ డమ్ కు మ్యాచ్ అయ్యే హీరోయిన్ కావాలి. కాజల్ అయిపోయింది. నయనతార అవుతోంది. ఇప్పుడు ఈ మూడో సినిమాకు ఎవరు హీరోయిన్? ఆ ప్లానింగ్ కూడా అయిపోయినట్లు తెలుస్తోంది.

సీనియర్ హీరోయిన్ అనుష్క ను కొరటాల శివ తన చాయిస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అనుష్కను చూసినవారు ఎవరూ హీరోయిన్ అని అనుకోవడం కష్టం. హైట్, వెయిట్, చబ్బీనెస్ అన్నీకలిపి పూర్తిగా అనుష్కను ఆంటీని చేసేసాయి. అందుకే కొరటాల ఓ కండిషన్ పెట్టారట.

మార్చి తరువాత షూట్ స్టార్ట్ అయ్యేలోగా వీలయినంత బరువు తగ్గి, కాస్త నాజూగ్గా తయారు కావాలన్నది ఆ కండిషన్. ప్రస్తుతం అనుష్క చేతిలో ఓ సినిమా వుంది. మాధవన్ హీరోగా కొనవెంకట్, పీపుల్స్ మీడియా నిర్మించే సినిమా అది. అది పట్టాల మీదకు రావడానికి ఇంకా టైమ్ వుంది. అందుకే ఇప్పుడు అనుష్క, ఎవరికీ తెలియని ప్లేస్ కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ తో కొత్త లుక్ తో జనాల ముందుకు వచ్చేపనిలో ప్రస్తుతం అనుష్క బిజీగా వున్నట్లు తెలుస్తోంది. ఈ వర్కవుట్ లు వర్కవుట్ అయితే మెగాస్టార్ పక్కన దేవసేనను చూడొచ్చు.

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?