Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాయిధరమ్.. నో బుకింగ్స్?

సాయిధరమ్.. నో బుకింగ్స్?

మెగా యంగ్ హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఒకరు. అయితే సరైన లైనప్ లేక,, సరైన సినిమా పడక, ఫ్లాపులు పలకరించడంతో వెనుకబడ్డారు. చేతిలో ఒకే ఒక్క సినిమా చిత్రలహరి వుంది. అది కూడా నాని రిజెక్ట్ చేయడంతో సాయిధరమ్ చేతిలోకి వచ్చింది. 

ఇది తప్పిస్తే మరో సినిమా ఏదీ సాయిధరమ్ చేతిలో లేదు. వాస్తవానికి గీతాఆర్ట్స్ ఓ సినిమా చేయాలి. మారుతి డైరక్షన్ లో ఓ సినిమా బకాయి వుంది. ఇంకోపక్క హీరోలు ఎవరూ అందుబాటులో లేక డైరక్టర్లు చాలా మంది కిందామీదా అవుతున్నారు. అయినా కూడా సాయిధరమ్ తరువాత సినిమా అంటే జవాబు లేని పరిస్థితి.

ఖాళీగా వున్న డైరక్టర్లు కానీ, సినిమాలు తీద్దామనుకున్న నిర్మాతలు కానీ ఎవ్వరూ సాయిధరమ్ గురించి ఎందుకు ఆలోచించడం లేదో? ఎంతసేపూ నాని, శర్వా, విజయ్ దేవరకొండ అంటూ చూస్తున్నారు. రవితేజ, నితిన్, రామ్, ఇలా సరైన డిమాండ్ లేని వారి జాబితాలో సాయిధరమ్ చేరిపోతున్నాడు. ఈ సమస్య నుంచి ఆదుకోవాల్సింది చిత్రలహరి సినిమానే.

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?