టాలీవుడ్ లో హీరోయిన్ అనుష్కపై పుట్టినన్ని గ్యాసిప్ లు మరే హీరోయిన్ పైన కూడా రాలేదంటే అతిశయోక్తి కాదు. అయితే గత ఏడాది కాలంగా ఈ రూమర్లకు తెరపడింది. కానీ బాహుబలి 2 తరువాత మళ్లీ ఇవి జోరందుకున్నాయి.
ముఖ్యంగా బాహుబలి 2 ప్రమోషన్ టైమ్ లో ప్రభాస్-అనుష్కల జోడీ ఎక్కడ చూసినా, చూడ ముచ్చటగా, వీలయినంత క్లోజ్ గా, రియల్ కెమిస్ట్రీతో కనిపించడంతో గ్యాసిప్ లు మళ్లీ గుప్పుమన్నాయి.
ప్రభాస్-అనుష్కల ప్రణయం, పెళ్లి, ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి రూమర్లు హల్ చల్ చేసాయి. దీంతో అనుష్కకు ఎక్కడి లేని కోపం వచ్చిందట. దయచేసి వీటిని ఆపండి. లేదంటే చట్టప్రకారం ప్రొసీడ్ అవుతాను అంటోందట. మరి ఇకనైనా ఇవి ఆగుతాయోమో చూడాలి. అయినా ఎందుకొచ్చిన గోల..కోపం.
పెళ్లీడు వయసు దాటిపోతొంది.చకచకా మాంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుంటే పోలా? ఈ నోళ్లనీ అవే మూతపడిపోతాయి కదా? ఎలాగూ చేతిలో ఎన్నో సినిమాలు లేవు. పెళ్లియినా కూడా మాంచి స్పెషల్ క్యారెక్టర్లు అనుష్క చేస్తానంటే, చేతిలో పెట్టే నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఎప్పుడూ వుంటారు. ఆ దిశగా ఆలోచిస్తే బెటరేమో?