క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల మధ్య ఏదో జరుగుతోందంటూ చాన్నాళ్ళుగా గాసిప్స్ విన్పిస్తున్న విషయం విదితమే. వీరిద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం ముదిరి పాకాన పడిందనీ, డిసెంబర్ 31 అర్థరాత్రి.. అనుష్క – విరాట్ ఏకాంతంగా కలుసుకున్నారనీ బాలీవుడ్‌లో గుసగుసలు గుప్పుమన్నాయి.
తూచ్.. అదంతా ఉత్తదేనని అనుష్క శర్మ ఖండించేసినా, తాజాగా కొన్ని వివరాలతో కూడిన ‘మీటింగ్’ వ్యవహారాన్ని బాలీవుడ్ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. విరాట్ కోహ్లీని పికప్ చేసుకోవడానికి అనుష్క శర్మ స్వయంగా ముంబై ఎయిర్ పోర్ట్‌కి వెళ్ళిందని కొందరు.. కాదు కాదు, తన కారుని విరాట్ కోసం డ్రైవర్‌తో అనుష్క పంపిందనీ, విరాట్ తన సొంత కారులో అనుష్క ఇంటికి వెళ్ళాడని ఇంకొందరు అంటున్నారు.
ఈ వార్తల్లో ఏది నిజమోగానీ.. క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తోన్న కోహ్లీ.. లవ్ ఎఫైర్స్ విషయంలోనూ సంచలన వార్తల్లోకెక్కేస్తున్నాడన్నది నిర్వివాదాంశం. క్రికెటర్లకీ, బాలీవుడ్ తారలకీ మధ్య ఎఫైర్లు నడవడం ఇదే కొత్త కాదు. గతంలో కొన్ని ఎఫైర్లు పెళ్ళి పీటలదాకా వెళ్ళాయి కూడా. మరి, అనుష్క – విరాట్ కోహ్లీల వ్యవహారం ఏమవుతుందో.!