హిట్టు వెనుకే చిత్రపరిశ్రమ అంతా పరుగులు తీస్తుందనేది అక్షరాలా నిజం. ఎవరికి హిట్ ఉంటే.. వాళ్ల చేతిలో అడ్వాన్సులు పెట్టడానికి నిర్మాతలు క్యూ కడుతుంటారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ దర్శకుడు మేర్లపాక గాంధీ విషయంలోనూ అదే జరుగుతోంది.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ విజయంతో తెలుగు నిర్మాతల్ని ఆకట్టుకొన్నాడు మేర్లపాక గాంధీ. ఇప్పుడు ఆయనకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. డి.వి.వి.దానయ్య నిర్మాణంలో ఆయనో సినిమా చేయబోతున్నారు. కథ సిద్ధమైంది. ఇందులో నితిన్ కథానాయకుడిగా నటిస్తాడని టాక్. రామ్ కూడా గాంధీ కథకు ఓకే చెప్పాడట.
అయితే ముందు నితిన్ సినిమానా? రామ్ దా.? అనేది తెలియాల్సివుంది. ఇద్దరూ యంగ్ హీరోలే. కాకపోతే నితిన్ ఖాతాలోనే హిట్స్ ఉన్నాయి. మరి గాంధీ ఏం చేస్తాడో చూడాలి.