మన టాలీవుడ్‌లోని భారీ నిర్మాతల్లో ఒకరైన రమేష్ పుప్పాలకు రొమాంటిక్ ప్రొడ్యూసర్‌గా అంతో ఇంతో పేరుంది. ఆ మధ్యన ఆయన పుట్టిన రోజు జరిగితే.. ఆ పార్టీ.. ముంబాయి నుంచి దిగుమతి చేసిన పొట్టి డ్రస్సుల భామల ఫ్యాషన్ పెరేడ్ మాదిరిగానే జరిగిందని.. అంతా చెవులు కొరుక్కున్నారు. కేవలం అందాల ప్రదర్శన కోసమే ఆ పార్టీకి వచ్చినట్లుగా.. కురచ దుస్తుల భామలందరూ రమేష్ పుప్పాల మీదపడి, ఆయన్ను ఒరుసుకుపోతూ నిల్చుని ఫోటోలు దిగుతూ ఆహుతులందరికీ కనువిందు చేశారు. రమేష్ పుప్పాల కూడా టాలీవుడ్ విజయమాల్యా స్థాయిలో అమ్మాయిల మధ్యలో తన పుట్టినరోజు వేడుకల్ని ఆస్వాదించారు.
అయితే సినిమాను విడుదల చేసుకునే టెక్నిక్ తెలియకపోయిన ఈ నిర్మాతకు ఓ హీరోయిన్‌కు నడుమ సంథింగ్ సంథింగ్ నడుస్తోందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ సరసన అనడంకంటె ఆయన సినిమాలో హీరో పట్ల క్రష్ పెంచుకునే రెండో హీరోయిన్‌గా గతంలో ఓ సినిమా చేసిన నాయిక.. ప్రస్తుతం రమేష్ పుప్పాల ఆశ్రయంలో ఉన్నట్లు సమాచారం. ఎప్పుడు హైదరాబాదు వచ్చిన ఆయన వద్దనే విడిది చేస్తోందని.. ఇద్దరూ కలిసి చెట్టపట్టాలేసుకుని.. చిలకా గోరింకల్లా తిరుగుతుంటారని.. పరిశ్రమ వర్గాలు కోళ్లయి కూస్తున్నాయి.
ప్రస్తుతానికి ఆ అమ్మడికి చేతిలో సినిమాలు లేవుగానీ.. తనకు మిగిలిపోయిన ‘హీరోయిన్’ అనే ట్యాగ్‌లైన్‌తో సదరు నిర్మాతతో చక్కర్లు కొడుతూ గడిపేస్తున్నదట మరి!!