కథానాయికల్ని అందంగా, ఇంకాస్త పొగరుగా చూపించడంలో పూరి జగన్నాథ్ శైలి విభిన్నం. పూరి సినిమాల్లో అమ్మాయిలు గడుసుగా కనిపిస్తారు గానీ, లోలోపల తెలియని అమాయకత్వం ఉంటుంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మానాన్న తమిళ అమ్మాయి సినిమాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. చిరుతలో అయితే నేహాశర్మలో పొగరే కనిపిస్తుంది.
మొత్తమ్మీద పూరి సినిమాల్లో కథానాయికలకూ మాంఛి ప్లేస్ ఉంటుంది. ఆ సినిమా వరకూ ఆ అమ్మాయి సూపర్ హిట్టే. ఇప్పుడు ఆదాశర్మ కూడా ఆ జాబితాలోకి చేరడం ఖాయంలా అనిపిస్తోంది. హార్ట్ ఎటాక్ సినిమాతో ఈ పోరీ తెలుగు సీమలోకి అడుగు పెట్టబోతోంది. హార్ట్ ఎటాక్ ట్రైలర్‌ని జనవరి 1న విడుదల చేశారు.
పూరి ఆదాపై ప్రేమను పూరాగా చూపించేశాడు ఈ ట్రైలర్‌లో. ఎటు చూసినా ఈ అమ్మాయే కనిపించింది. హీరోయిన్ ఓరియెంటెడ్ ట్రైలర్‌ని తీర్చిదిద్దాడు. ఆదా కూడా అందంగానే కనిపించింది. తెరపై ఇంకెంత ఆకట్టుకొంటుందో. మొత్తానికి ఓ అందమైన కథానాయికను తెలుగు తెరకు తీసుకొచ్చాడు పూరి. మిగతా దర్శక నిర్మాతలు పూరికి థ్యాంక్స్ చెప్పుకొంటారేమో..??