బోర్ కొట్టేస్తోంది బాబోయ్.. అం టున్నాడు జగపతి బాబు. 'నాన్నకు ప్రేమతో' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లోనే జగపతి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం విశేషం. తనకు ఈ ఇన్నింగ్స్ లో టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఇస్తున్న పాత్రల తీరుతెన్నులపై స్పందిస్తూ జగపతి ఈ విధంగా స్పందించాడు. తనను సంప్రదిస్తున్న దర్శకులు తనకు ఇస్తున్న పాత్రలు.. తను చేస్తున్న పాత్రలు.. పరమ రొటీన్ గా ఉన్నాయని జగపతి చెబుతున్నాడు. తనను ఒక రిచ్ ఫాదర్ గా చూపడానికే దర్శకులు ప్రయత్నిస్తున్నారని జగపతి వ్యాఖ్యానించాడు!
ఈ మధ్య కాలంలో చేసిన, చేస్తున్న సినిమాలను జగపతి ప్రస్తావించాడు. “శ్రీమంతుడు'' సినిమాలో తను ఒక రిచ్ ఫాదర్ గా కనిపించానని.. ఆ తర్వాత ఎన్టీఆర్, సుకుమార్ లు తనను సంప్రదిస్తే మరో ఆలోచన లేకుండా ఈ సినిమాను ఓకే చేశానని, వీళ్ల కాంబోలో కథ గురించి వినాల్సిన అవసరం కూడా ఉండదని అనుకున్నానని.. అయితే తీరా తొలి రోజు షూటింగ్ తర్వాత తన పాత్ర తీరు తెన్నులు తెలుసుకుని రొటీన్ గా ఫీలయ్యానని జగపతి వివరించాడు. ఇందులో కూడా సూటూబూటు వేసుకున్న ఒక రిచ్ ఫాదర్ గా కనిపిస్తున్నానని జగపతి అన్నాడు. అయితే సినిమా పూర్తయ్యే సరికి.. ఔట్ పుట్ చేసి.. సంతృప్తిగా ఫీలయ్యాయనని జగపతి వ్యాఖ్యానించాడు.
బయట కూడా తన స్నేహితులు, సన్నిహితులు.. తనను 'రిచ్ ఫాదర్' అంటూ సంబోధిస్తున్నారని జగపతి చెప్పాడు. ఈ విధమైన మాటలతో తన ఫీలింగ్స్ ని వివరించాడు జగపతి. మరి ఈ విధంగా తనకు కొత్తదనంతో నిండిన పాత్రలు ఇవ్వాలని.. వైవిధ్యంగా చూపాలని టాలీవుడ్ మూవీ మేకర్స్ ను జగపతి కోరుతున్నాడు! మరి జగపతి కోరికను తీర్చేదెవరో!