Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అరవై గంటల డబ్బింగ్

అరవై గంటల డబ్బింగ్

అనుభవం పండిన నటులకు డబ్బింగ్ అంటే నల్లేరు మీద బండి నడక. చకచకా సాగిపోతుంది. మహా అయితే ఓ నైట్ లోనో, రెండు సిట్టింగ్ ల్లోనో కానిచ్చేస్తారు. కానీ సీనియర్ నటుడు మోహన్ లాల్ తొలి ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమా మనమంతా కోసం 60 గంటలు డబ్బింగ్ చెప్పారట. దీనికి కారణం మోహన్ లాల్ పంతమేనట. 

మనమంతా కు తనే స్వయంగా డబ్బింగ్ చెబుతా అని మోహన్ లాల్ ఆసక్తి చూపించారు. డైరక్టర్ యేలేటి చంద్రశేఖర్ కూడా ఒకె అన్నారు. కానీ టీజర్ విడుదలయ్యేసరికి మోహన్ లాల్ డబ్బింగ్ పై విమర్శలు వినిపించాయి. దాంతో డబ్బింగ్ ఆర్టిస్టుతో పని కానిచ్చేస్తానని డైరక్టర్ అనేసరికి మోహన్ లాల్ కు పంతం వచ్చిందట. పని గట్టుకుని, వారం రోజులు హైదరాబాద్ లో కేవలం డబ్బింగ్ కోసమే వుండి, 60 గంటలు వర్క్ చేసి డబ్బింగ్ చెప్పి, శభాష్ అనిపించేసుకున్నాడట.

ఇదిలా వుంటే జనతా గ్యారేజ్ డైరక్టర్ కొరటాల శివ కూడా దీనిపైనే ఆధారపడ్డారట. మనమంతా సినిమా విడుదయ్యాక మోహన్ లాల్ డబ్బింగ్ పై జనం రెస్పాన్స్ చూసి అప్పుడు ఏం చేయాలా అన్నిది డిసైడ్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?