పెళ్లి చూపులు సినిమా పెట్టుబడి మొత్తం శాటిలైట్ లోనే వచ్చేలా కనిపిస్తోంది. ఈ చిన్న సినిమాకు మాంచి కాన్ఫిడెన్స్ తో ప్రీ పబ్లిసిటీ చేసారు. కోటిన్నర ఖర్చయిన ఈ సినిమాను సురేష్ మూవీస్ అంతే మొత్తానికి తీసేసుకుందని, పబ్లిసిటీకి 60 లక్షల వరకు ఖర్చు చేసిందని, అసలు నిర్మాతలకు శాటిలైట్ లో 70 పర్సంట్ వాటా వుందని ఇండస్ట్రీ సమాచారం.
అయితే సురేష్ బాబు తీసుకోలేదని, కొంత అడ్వాన్స్ మాత్రం ఇచ్చి, పబ్లిసిటీ ఖర్చులు పెట్టి విడుదల చేసారని, నిర్మాతలు, సురేష్ బాబు షేర్ చేసుకుంటారన్నది గుసగుస. ఏమయితేనేం సినిమా మొత్తం వాల్యూ మహా అయితే రెండు కోట్లకు మించదు.
ఈ సినిమా ఓపెనింగ్స్ డల్ గా వున్నా, హైదరాబాద్, ఓవర్ సీస్ ల్లో మాత్రం బాగా పుంజుకుంది. ఒక్క ఓవర్ సీస్ లోనే ఇప్పటికి ఖర్చులు పోను బయ్యర్ కు మంచి లాభాలు ఇస్తోంది. ఆంధ్ర, తెలంగాణ ల్లోని నగరాల్లో కలెక్షన్లు స్లోగా పుంజుకుంటున్నాయి.
వాటి సంగతి ఎలా వున్నా శాటిలైట్ పక్కన వుంచారు కాబట్టి, మంచి సినిమాగా ఇప్పుడు మంచిరేటు పలుకుతుంది. కనీసం మూడు కోట్లుపలికే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అంటే పెట్టుబడి, లాభం అన్నీశాటిలైట్ నే తెచ్చి పెట్టేలా వుంది.