అరవై రోజులు అంటే మాటలా?

ఓ సినిమా షూటింగ్ ఎన్నాళ్లు చేస్తారు. గట్టిగా యాభై రోజులు చాలు..మరీ భారీ సినిమా అయినా కూడా మిగిలిన వ్యవహారాలకు ఎక్కువ టైమ్ పడుతుందేమో కానీ, టాకీ షూటింగ్ కు మాత్రం కాదు. బాహుబలి…

ఓ సినిమా షూటింగ్ ఎన్నాళ్లు చేస్తారు. గట్టిగా యాభై రోజులు చాలు..మరీ భారీ సినిమా అయినా కూడా మిగిలిన వ్యవహారాలకు ఎక్కువ టైమ్ పడుతుందేమో కానీ, టాకీ షూటింగ్ కు మాత్రం కాదు. బాహుబలి లాంటి సినిమాలకు ఇక్కడ మినహాయింపు వుంటుంది.

మరి రజనీ సినిమా కబాలి కోసం ప్రకాష్ రాజ్ ను ఏకంగా 60 రోజుల బల్క్ డేట్లు అడిగారట. అంటే మరి ఆ పాత్ర ఏ రేంజ్  లో వుంటుందో, రజనీతో కాంబినేషన్ సీన్లు అందులో ఎన్నో. కేవలం ఇందువల్లనే ఆ సినిమా వదులుకున్నా అంటున్నాడు ప్రకాష్ రాజ్.

పైగా మంచి పాత్ర అంటూ కితాబిస్తున్నాడు. మరి మంచి పాత్ర అయినపుడు, వాళ్లకు కూడా ప్రకాష్ రాజ్ కావాలనుకున్నపుడు కాస్త డేట్లు తగ్గించుకుని టాకీ చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదో? బల్క్ గా అడిగారు అంటే కాంబినేషన్లు, సినిమా త్వరగా ఫినిష్ చేయాలన్న ఆలోచన వుండి వుంటాయి అనుకోవాలి.

కానీ ఎన్ని చిన్న సినిమాలు చేస్తే, ప్రకాష్ రాజ్ కు రజనీ సినిమాలో చేసిన ఫాలోయింగ్, పేరు వస్తాయి? ప్రకాష్ రాజ్ కు ఆ సంగతి తెలియంది కాదు. తెలిసి, ఒప్పుకుని కూడా తప్పుకున్నాడంటే. సమ్ థింగ్..సమ్ థింగ్ అనుకోవాలా?