అరవింద బయ్యర్లకు పండగ భరోసా

తమ సినిమాలను ట్రేడ్ అనుకునే రేట్లకన్నా కనీసం పాతికశాతం ఎక్కువకు అమ్మడం, అమ్మగలగడం అన్నది హారిక హాసిని స్పెషాలిటీ. అందువల్లే ఆ సంస్థ సినిమాలు హిట్ అయినా కూడా బయ్యర్లకు పైసలు మిగలడం అన్నది…

తమ సినిమాలను ట్రేడ్ అనుకునే రేట్లకన్నా కనీసం పాతికశాతం ఎక్కువకు అమ్మడం, అమ్మగలగడం అన్నది హారిక హాసిని స్పెషాలిటీ. అందువల్లే ఆ సంస్థ సినిమాలు హిట్ అయినా కూడా బయ్యర్లకు పైసలు మిగలడం అన్నది చాలా అరుదుగా జరిగే సంగతి. నిజానికి హారిక హాసిని సంస్థ మూలస్థంభం అయిన చినబాబు తన బయ్యర్లకు గురించి చాలా ఆతృత కనబరుస్తుంటారు. కానీ రేట్లు మాత్రం ఆకాశంలోనే వుంచి అమ్ముతారు అన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయం.

బ్యాక్ టు బ్యాక్ కాస్త కాంబినేషన్ వుండే సినిమాలు వుండడం, ట్రాక్ రికార్డు బాగుండడం, ఫిక్స్ డ్ బయ్యర్లు కావడంతో హారిక హాసిన నడక అలా సాగిపోతోంది. ఎప్పుడు అజ్ఞాతవాసికి కాస్త డబ్బులు వెనక్కు ఇచ్చారో, బయ్యర్లలో భరోసా మరీ పెరిగింది. అందుకే అరవింద సమేత వీరరాఘవ సినిమాను చెప్పిన రేట్లకు చెప్పినట్లు కొన్నారు. పంపించమన్నంత పంపించారు.

హారిక హాసిని కూడా ఉదారంగా వైట్ అమౌంట్ కు ప్రతి జిల్లాలో జీఎస్టీని తామే కట్టేసింది. ఆ విధంగా బయ్యర్లకు కొంత భారం తప్పింది. దానికితోడు తేడావస్తే తాము చూసుకుంటాం అని అనడంతో ఎక్కడా కూడా ఇక బేరాలులేవు. చెప్పిన రేట్లే ఫిక్స్ అయిపోయాయి. దీనికితోడు ఎగస్ట్రా షో జీవో, రేటు పెంచుకునే జీవో తెప్పించారు.

ఇన్ని చేసినా, ఫస్ట్ వీకెండ్ 4 రోజులకు 50 నుంచి 60 శాతం రికవరీనే వచ్చింది. మిగిలినది సరిగ్గా ఏడురోజుల్లో రావాలి. ఈ ఏడు రోజులతో అంటే 21తో దసరా సీజన్ ముగిసిపోతుంది. ఈ ఏడురోజుల్లో కూడా రెండు సినిమాలు ఇంతో అంతో పోటీని ఇవ్వబోతున్నాయి.

అవి అరవిందతో చూసుకుంటే చిన్న సినిమాలే కావచ్చు, కానీ బిసి సెంటర్లలో కాస్త ఆసక్తి వున్న సినిమాలే. ఇప్పటికే అరవింద కింద సెంటర్లు అయిన బి సిల్లో వీక్ గానే వుంది. అక్కడ పండగను ఆ రెండు సినిమాలు తీసేసుకుంటే కష్టం అవుతుంది.

అర్బన్ సెంటర్లలో అరవిందకు ప్లస్ వుంటుంది. పైగా ఎంత షేర్ చేసుకున్నా, పండగ మూడురోజులు చాలావరకు రికవరీని తీసుకువస్తాయని బయ్యర్లు నమ్ముతున్నారు. దాదాపు 70 నుంచి 80శాతం బయ్యర్లు గట్టేక్కేస్తారని, మిగిలిన వారికి మహా అయితే 10 పర్సంట్ వుండిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి మరి ఎలా వుంటుందో పరిస్థితి.

తొలి నాలుగు రోజులకు ఆంధ్ర, తెలంగాణలో ఫిగర్లు ఇలా వున్నాయి.

నైజాం.. 12.10
సీడెడ్…8.95
ఉత్తరాంధ్ర…5.26
ఈస్ట్……4.04
వెస్ట్…….3.00
కృష్ణ…3.10
గుంటూరు….5.95
నెల్లూరు….1.80

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి