భలే చిరునామా.. సమంత?

మీ టూ ఉద్యమం ఇప్పుడు ఊపు అందుకుని వుండొచ్చు కానీ, అడ్డదిడ్డంగా, అడ్డగోలుగా, తన ఇష్టం వచ్చినట్లు వెళ్లినా, శ్రీరెడ్డి ఎప్పుడో టాలీవుడ్ లో స్టార్ట్ చేసింది. కొంతమంది బాధితులను కూడ గట్టే ప్రయత్నం…

మీ టూ ఉద్యమం ఇప్పుడు ఊపు అందుకుని వుండొచ్చు కానీ, అడ్డదిడ్డంగా, అడ్డగోలుగా, తన ఇష్టం వచ్చినట్లు వెళ్లినా, శ్రీరెడ్డి ఎప్పుడో టాలీవుడ్ లో స్టార్ట్ చేసింది. కొంతమంది బాధితులను కూడ గట్టే ప్రయత్నం చేసింది. చానెళ్లు కూడా దన్నుగా నిల్చున్నాయి. అలాంటి టైమ్ లో టాలీవుడ్ పెద్దలు రంగప్రవేశం చేసారు. టాలీవుడ్ పరువుపోతోందని విలవిలలాడిపోయారు. ఓ కమిటీ కూడా వేసారు. సినిమా రంగంలో ఎక్కడ ఏ సమస్య వున్నా, ఆ కమిటీకి విన్నవించాలన్నారు. ఆ తరువాత చానెళ్లు అన్నీ సినిమా పెద్దల వైపు తిరిగి, బాధితులను, డిస్కషన్లను పూర్తిగా పక్కన పెట్టాయి.

ఇలాంటి టైమ్ లో మీటూ ఉద్యమం బాలీవుడ్ ను కుదిపేస్తోంది. దీంతో టాలీవుడ్ లో కూడా మళ్లీ ఈ ప్రకంపనాలు బయల్దేరే అవకాశం వుందని వినిపించడం ప్రారంభమైంది. దీంతో సినిమా జనాలు కొందరు అప్పుడే సమావేశాలు పెట్టి, మీటూ ఉద్యమాన్ని పద్దతిగా ముందుకు తీసుకెళ్తామని ఫీలర్లు వదిలారు. నిజానికి ఇలా మీటింగ్ లు పెట్టేవారు ఇండస్ట్రీలో కీలకంగా వున్నవారు. వీళ్లు ఇండస్ట్రీకి వ్యతిరేకంగా వెళ్లే సమస్య లేదు. ఎవరైనా తొందరపడి ముందుక వెళ్తారేమో, వాళ్లను కమిటీ వైపు లాగి, టాలీవుడ్ పెద్దలకు ఏమీకాకుండా ఫిల్టర్ చేసే ప్రయత్నమే ఈ 'మీటింగ్'ల వెనుక వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో ఓ ప్రముఖ దర్శకుడు అమ్మాయిలను గోకేస్తారని గుసగుస వుంది. ఇప్పుడు ఆయన మీద ఎవరైనా ఫిర్యాదు తీసుకువచ్చి, ఈ కమిటీకి ఇస్తే, ఈ కమిటీలోని జనాలు ఏం చేయగలరు. మహా అయితే రాజీనో, ఇంకేదైనా చేస్తారేమో? అన్న కామెంట్లు ఇండస్టీలో వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఓ నిర్మాత కమ్ ప్రొడక్షన్ మేనేజర్ మీద ఆరోపణలు వచ్చాయి. ఇండస్ట్రీలో అవి నిజమే అని గుసగుసలు కూడా వినిపించాయి. కానీ ఏమయింది? అంతా గప్ చుప్.

ఇదిలా వుంటే సమంత కూడా మీటూ ఉద్యమంలో ధైర్యంగా ముందుకు రావాలని, అలా రాలేకపోతే, ఈ చిరునామాకు ఫిర్యాదులు పంపాలని ట్వీట్ చేసారు. పానెల్ ఎగెనిస్ట్, సెక్సువల్ హెరాస్ మెంట్ కేరాఫ్ రామానాయుడు స్టూడియో అని చిరునామా ఇచ్చారు.

శ్రీరెడ్డి ఉదంతం స్టార్ట్ అయిందే రామానాయుడు స్టూడియో వారసుల వ్యవహారం మీద. వీడియోలు కొన్ని చలామణీ అయ్యాయి. డైరక్టర్ తేజ మధ్యవర్తిగా బేరసారాలు కూడా సాగాయని వదంతులు బయటకు వచ్చాయి. అవన్నీ గప్ చుప్ అయ్యాయి. సురేష్ బాబు తన చిన్న కుమారుడిని బెంగళూరు పంపేసారని, కూడా గ్యాసిప్ లు వినవచ్చాయి.

ఇప్పుడు ఆ స్టూడియో చిరునామాకు ఫిర్యాదులు పంపించమంటే, బాధితులు నమ్ముతారా? అనుమానమే.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి