అరవిందకు టైమ్ సరిపోతుందా?

త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా అరవింద సమేత. అక్టోబర్ 11 ఈ సినిమా విడుదలకు ముహూర్తం. అయితే నిన్న మొన్నటి దాకా బోలెడు టైమ్ వుంది అనే అనుకున్నారు. కానీ ఇప్పుడు టైమ్…

త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా అరవింద సమేత. అక్టోబర్ 11 ఈ సినిమా విడుదలకు ముహూర్తం. అయితే నిన్న మొన్నటి దాకా బోలెడు టైమ్ వుంది అనే అనుకున్నారు. కానీ ఇప్పుడు టైమ్ ఈజ్ రన్నింగ్ అంటున్నారు. అజ్ఞాతవాసి తరువాత హారిక హాసిని నిర్మిస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ తొలి కాంబినేషన్ కావడం కీలకమైన విశేషం. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా 60రోజుల వరకు బకాయి వుంది. అంటే రెండునెలలు. జూలై అయిపోవచ్చింది. అంటే ఆగస్టు, సెప్టెంబర్ అంతా షూట్ వుంటుంది. అది కూడా కంటిన్యూగా కొట్టుకుంటూ వెళ్తే. ఇక మిగిలేది అక్టోబర్ లో 11రోజులు.

అంటే సినిమా షూటింగ్ ఓ పక్క చేస్తూనే ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్, డిటీఎస్ మిక్సింగ్, డిఐ అన్నీ సమాంతరంగా చేసుకుంటూ వెళ్లాలి. లేదూ అంటే కష్టం కావచ్చు. హీరో ఎన్టీఆర్ కాబట్టి, పవన్ కాదు కాబట్టి, షూటింగ్ ఎప్పుడు వుంటుందో, ఎప్పుడు వుండదో అన్న సమస్య అయితేరాదు. షెడ్యూళ్లు పక్కాగానే వుంటాయి. ఎటొచ్చీ ఎక్కడా వేస్ట్ కాకుండా, గ్యాప్ లు రాకుండా చూసుకోవాలి.