బాలీవుడ్ లో సినిమా చేయాలని అందరు హీరోలకు వుంటుంది. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటారు. కానీ ఏ ప్రయత్నం చేయకుండానే అనుకోకుండా ఓ యంగ్ హీరో తలుపు తట్టింది బాలీవుడ్ అవకాశం. అయితే ఇది ఇంకా తొలి అడుగు మాత్రమే. టోటల్ గా మెటీరియలైజ్ కావడానికి ఇంకా చాలాదూరం వుంది.
గతంలో డంగల్ లాంటి ప్రతిష్ట్మాతక చిత్ర నిర్మాణంలో, రూపొందించడంలో పాలు పంచుకున్న కొందరు కలిసి ఓ బాలీవుడ్ సినిమా నిర్మాణం తలపెట్టారు. ఈ సినిమా కథకు నలుగురు యంగ్ హీరోలు కావాలి. ముగ్గురు బాలీవుడ్ హీరోలతో పాటు ఓ సౌత్ హీరోను కూడా తీసుకోవాలని ఆలోచన చేసారు.
అప్పుడు వారి దృష్టికి వచ్చిన హీరో నిఖిల్. తెలుగులో మీడియం రేంజ్ సినిమాలు చేస్తున్న హీరో నిఖిల్ ను ఓ పాత్రకు తీసుకుంటే ఎలా వుంటుందా? అని ఎంక్వయిరీలు చేసి, ఆఖరికి ముంబాయికి ఆహ్వానించారు. ప్రస్తుతం ముద్ర సినిమా చేస్తూ, మరో రెండు సినిమాలు కమిట్ అయిన నిఖిల్, ముంబాయి అయితే వెళ్లి వచ్చాడు కానీ, ఫిఫ్టీ ఫిఫ్టీ ఆలోచనలతో వున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ అంటే ఓ రేంజ్ కు వచ్చినట్లు అయింది. బాలీవుడ్ అంటే మళ్లీ ఎబిసిడి దగ్గర మొదలుపెట్టాలి. అందుకే ప్రస్తుతానికి అలా వెయిట్ అండ్ సీ అనే ఆలోచనతో వున్నట్లు తెలుస్తోంది.