అరవింద లీక్ వీడియో సంగతులు

అరవింద సమేతకు సంబంధించిన కీలక యాక్షన్ సీన్ వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. రఫ్ వెర్షన్ అయినా చాలా క్లియర్ గా వుండి, సినిమాలో కీలక ఘట్టాన్ని జనాలకు పరిచయం చేసేసింది. ఇది…

అరవింద సమేతకు సంబంధించిన కీలక యాక్షన్ సీన్ వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. రఫ్ వెర్షన్ అయినా చాలా క్లియర్ గా వుండి, సినిమాలో కీలక ఘట్టాన్ని జనాలకు పరిచయం చేసేసింది. ఇది బోయపాటి, కొరటాల శివ సినిమానా అన్నట్లుగా త్రివిక్రమ్ భయంకరమైన, భారీ యాక్షన్ సీన్ ను డిజైన్ చేసారు. ఇప్పుడు ఈ సీన్ కు సంబంధించి కొన్ని అప్ డేట్స్ తెలుస్తున్నాయి.

సినిమాలో ఈ భారీ యాక్షన్ సీన్ ఆరంభంలోనే వుంటుందని తెలుస్తోంది. ఈ సీన్ నేపథ్యంలోనే 'రం.. రుధిరం.. సం.. సమరం' అనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వస్తుందని టాక్. లీక్ అయిన వీడియోలో ఎన్టీఆర్ కారులోంచి దిగడం వరకు కనిపిస్తోంది. ఆ తరువాత ఊచకోత ఓ లెక్కలో వుంటుందని తెలుస్తోంది.

ఖలేజా సినిమాలో మహేష్ బాబు మీద ఓపెనింగ్ ఫైట్ ఒకటి భారీగా అప్పట్లో త్రివిక్రమ్ తీసారు. ఇప్పుడు ఈ ఫైట్ దానికి రెండింతలుగా వుంటుందని అంటున్నారు. అమ్మమ్మ/నాయనమ్మ సలహాతో హీరో హైదరాబాద్ కు షిప్ట్ అవ్వడంతో కథ ముందుకు సాగుతుందని, విశ్రాంతికి ముందు రెండు పాటలు, విశ్రాంతి తరువాత రెండు పాటలు వుంటాయని టాక్.