Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్ కంటే వారం ముందు వస్తున్న ఎన్టీఆర్

రామ్ కంటే వారం ముందు వస్తున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అరవింద్ సమేత విడుదలకు అన్-అఫీషియల్ గా డేట్ లాక్ అయింది. అక్టోబర్ 11న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. టీజర్ తో పాటు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలనుకుంటోంది యూనిట్. 

ఆగస్ట్ 15న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే టీజర్ వర్క్ స్టార్ట్ చేస్తాడు త్రివిక్రమ్. నిజానికి ఈ సినిమాను అక్టోబర్ 19న విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్నిరోజుల కిందట అదే తేదీని రామ్ లాక్ చేశాడు. తను చేస్తున్న 'హలో గురు ప్రేమకోసమే' సినిమాను దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు.

దీంతో రామ్ సినిమా కంటే వారం రోజుల ముందు అరవింద్ సమేతను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ డీల్ కంప్లీట్ అయింది. జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని దక్కించుకుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ తో కలుపుకొని 16కోట్ల రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.

పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?