Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అర్జున్ సురవరం బౌన్స్ బ్యాక్

అర్జున్ సురవరం బౌన్స్ బ్యాక్

సాధారణంగా ఓ సినిమా రిలీజ్ వాయిదాలు పడుతూ అలా వెనక్కు వెనక్కు వెళ్తే, ఇక అంతే సంగతులు. జనానికి ఆ సినిమా మీద ఆసక్తి తగ్గిపోతుంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం వరకు నిఖిల్ 'అర్జున్ సురవరం' సినిమా పరిస్థితి అదే.

అనేక సార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమాను కొన్నాళ్లు జనం మరిచిపోయారు. కానీ లేటెస్ట్ గా విడుదల డేట్ వచ్చిన తరువాత పరిస్థితి మారింది.

మెల మెల్లగా మళ్లీ సినిమాకు బజ్ రావడం ప్రారంభమైంది. నిఖిల్ కష్టపడడం కావచ్చు, సినిమాకు సాగిస్తున్న ప్రచారం కావచ్చు, మెగాస్టార్ ను ప్రీ రిలీజ్ మీట్ కు తీసుకురావడం వల్ల కావచ్చు. ఇప్పుడు అర్జున్ సురవరం సినిమా టాక్ ఆఫ్ ది వీక్ అయింది. ఈ వారం వస్తున్న సినిమాలు ఏవీ అంటే, వెంటనే అర్జున్ సురవరం గుర్తుకు వస్తోంది.

సినిమా కూడా అన్ని ఏరియాలు మంచి మంచి బయ్యర్ల చేతిలో వుంది. అందువల్ల థియేటర్లు కూడా మంచివి పడ్డాయి. సోషల్ మీడియాలో బాగా ప్రచారం సాగింది. అది కూడా కలిసి వచ్చింది. నిన్నటికి నిన్న మెగాస్టార్ ఫంక్షన్ కు వచ్చి, తనకు తానే వచ్చానని, సినిమా జనాల్లోకి వెళ్లాలని ఆలోచించి ఇలా చేసానని చెప్పడం మరింతగా బజ్ తీసుకువచ్చింది.

బయటకు వచ్చిన పాట, ట్రయిలర్ అన్నీ ఓ స్థాయిలొ వుండడంతో సినిమా మీద కాస్త ఆసక్తి ఏర్పడింది. మంచి ఓపెనింగ్, మంచి టాక్ రాబట్టుకోగలగితే, ఆకలి మీద వున్న ప్రేక్షకులు సంతృప్తిచెందుతారు. ఈ సినిమాకు నిర్మాత ఆకెళ్ల రాజ్ కుమార్. సమర్పకులు టాగోర్ మధు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?